Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎలైట్ లీగ్... స‌ల్మాన్, అక్ష‌య్, ప్ర‌భాస్!

ఎలైట్ లీగ్... స‌ల్మాన్, అక్ష‌య్, ప్ర‌భాస్!

ప్ర‌స్తుతం దేశంలోనే అత్యంత భారీ పారితోషికం పొందుతున్న హీరోల జాబితాలో ఈ ముగ్గురూ టాప్ పొజిష‌న్లో నిలుస్తున్నార‌ని అంటోంది బాలీవుడ్ మీడియా. ఈ ముగ్గురు హీరోలూ ఇప్పుడు పారితోషికం విష‌యంలో ఎలైట్ లీగ్ ను ఏర్ప‌రుస్తున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. గ‌త కొన్ని సినిమాల విష‌యంలో వీరు ముగ్గురూ హ‌య్యెస్ట్ రేంజ్ రెమ్యూనిరేష‌న్ అందుకుంటున్నార‌ని రిపోర్ట్. 

వీరిలో.. కూడా ప్ర‌స్తుతానికి ప్ర‌భాస్ దే పై చేయి. ఆదిపురుష్, స్పిరిట్ సినిమాల‌కు ప్ర‌భాస్ ఏకంగా నూటా యాభై కోట్ల రూపాయ‌ల పారితోషికం అందుకున్నాడ‌ని, అదే స‌ల్మాన్, అక్ష‌య్ ల విష‌యానికి వ‌స్తే వారు వంద కోట్ల రూపాయ‌ల రేంజ్ లో ఉన్నార‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 

ఆదిపురుష్, స్పిరిట్ సినిమాల‌కు ప్ర‌భాస్ నూటా యాభై కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ తో రికార్డును సృష్టించాడు. బెల్ బాట‌మ్ సినిమాకు అక్ష‌య్ కుమార్ వంద కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ అందుకున్నాడ‌ని, వీరితో పాటు.. టైగ‌ర్ జిందా హై, సుల్తాన్ సినిమాల‌కు స‌ల్మాన్ ఖాన్ రెమ్యూనిరేష‌న్ వంద కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది. 

ఇలా ఇప్పుడు దేశంలోనే అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న టాప్ లీగ్ హీరోల్లో ప్ర‌భాస్, అక్ష‌య్, స‌ల్మాన్ లు ఉన్నారు. ఈ నంబ‌ర్లేవీ అధికారిక ధ్రువీక‌ర‌ణ‌లు కాక‌పోయినా.. సినిమా హీరోల పారితోషికం విష‌యంలో టాక్ లే ఎప్పుడూ హాట్ టాపిక్ లు అవుతుంటాయి. ప్ర‌స్తుతానికి వీరిదే టాప్ రేంజ్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?