Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నందమూరి, మెగా .. ఇరు వర్గాలూ హ్యాపీ!

 నందమూరి, మెగా .. ఇరు వర్గాలూ హ్యాపీ!

మీ సినిమా ఫెయిల్యూర్ అంటే.. మీ సినిమా డిజాస్టర్.. అనుకుంటున్నారు నందమూరి- మెగాఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా వీళ్ల శాడిస్టిక్ ప్లజర్ వ్యక్తం అవుతోంది. ముందుగా ఎన్టీఆర్- కథానాయకుడు సినిమా విషయంలో నెగిటివ్ ను గట్టిగానే స్ప్రెడ్ చేశారు మెగా ఫ్యాన్స్. ప్రత్యేకించి బాలయ్యను లక్ష్యంగా చేసుకుని వారు ప్రచారం చేశారు.

ఎన్టీఆర్ కథ ఓకే కానీ.. ఎన్టీఆర్ గా బాలయ్య అస్సేలే మాత్రం సూటు కాలేదని.. ఏదో మహానటి పుణ్యమా అని మల్టీప్లెక్స్ ల్లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ దక్కుతున్నాయి తప్ప.. మరేంలేదనే ప్రచారాన్ని ముమ్మరంగా సాగించారు. ఒకరకంగా గేలిచేశారు కూడా!

కట్ చేస్తే.. విన విధేయరామ సినిమా వచ్చింది. నందమూరి ఫ్యాన్స్ కు అవకాశం దొరికింది. వినయ విధేయరామ గురించి ఎంత నెగిటివ్ గా పోస్ట్ చేయాలో అంతగానే చేస్తున్నారు. వీవీఆర్ తో పోలిస్తే.. ఎన్టీఆర్ బయోపిక్కే చాలా చాలా బెటర్ అనే టాక్ వినిపిస్తోంది.

ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సంక్రాంతి సందర్భంగా ఈ రెండింటిలో ఛాయిస్ గా బాలయ్య సినిమానే ఎంచుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి అభిమానుల ఆనందం పతాకస్థాయికి చేరింది. తమ వాడి సినిమా ఆకట్టుకోకపోయినా.. పక్కవాడి సినిమా మరింత డిజాస్టర్.. అయితే వీళ్ల ఆనందం ఎలా ఉంటుందో.. చెప్పడానికి ప్రత్యేకంగా సైకాలజీ తెలియాల్సిన అవసరం ఏమీలేదు.

నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా పేజ్ లను చూస్తేనే అర్థం అయిపోతోంది. ఇప్పటికే ఎప్పుడో తెలుగునాట హీరోలపై మితిమీరిన అభిమానం.. పైత్యానికి చేరిపోయింది. మొత్తానికి తమ తమ అభిమాన హీరోల సినిమాలు హిట్ అనిపించుకోకపోయినా.. ఫెయిల్యూర్ అనిపించుకోవడంలో పోటీపడటంతో.. ఇరువర్గాల అభిమానులూ ఆనందంగా ఉన్నారు. అదే ఈ సంక్రాంతి స్పెషల్!

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?