Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ కి తెలియదా?

బన్నీ కి తెలియదా?

హీరో బన్నీకి సంబంధించి నిన్నటికి నిన్న మాంచి హ్యాపనింగ్ డే. పుష్ప ఫస్ట్ లుక్ విపరీతంగా ట్రెండింగ్ అయింది.  బర్త్ డే విసెష్ సంగతి చెప్పనక్కరే లేదు. అయితే అదే టైమ్ లో బన్నీ ఫ్యాన్స్ కు మరోసారి ఐకాన్ ప్రాజెక్టు గుర్తుకు వచ్చింది. ఐకాన్ సినిమా ఎప్పడో జరగాల్సింది. హడావుడిగా ప్రకటించారు. బన్నీ కూడా విపరీతంగా ఆ సబ్జెక్ట్ ను లైక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అంత వేగంగానూ వెనక్కు పెట్టారు.

అయితే బన్నీ ఆ ప్రాజెక్టును వదులుకోలేదని, తన కోసం దాన్ని అలా వుంచమని దర్శకుడు శ్రీరామ్ వేణు ను కోరారని వార్తలు అప్పట్లో వచ్చాయి. బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్ కూడా ఇదే విషయం 'గ్రేట్ ఆంధ్ర' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే అల వైకుంఠపురములో తరువాత సుకుమార్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని ముందు నుంచీ నుంచీ అనుకున్నదే. అదే స్టార్ట్ కాబోతోంది.

కానీ దాని తరువాత ఐకాన్ నే చేస్తారా? అన్నది మాత్రం ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఇలాంటి టైమ్ లో నిన్నటికి నిన్న మళ్లీ ఐకాన్ సినిమా గుర్తుకు వచ్చింది. బన్నీ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ దిల్ రాజు బ్యానర్ తరపున ఐకాన్ డిజైన్ ను విడుదల చేసారు. దాంతో మళ్లీ ఐకాన్ తెరపైకి వచ్చింది. ఐకాన్ ప్రాజెక్టు వుంది..ఆగిపోలేదు ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.

కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న విషయం వేరుగా వుంది. ఐకాన్ పోస్టర్ తో విసెష్ చెబుతారన్న సంగతి బన్నీకి తెలియదట. పోస్టర్ బయటకు వచ్చిన తరువాతే బన్నీ కి తెలిసిందని బోగట్టా. అయితే అలా అని పోస్టర్ పెద్ద కొత్తదీ కాదు, విషయమూ కొత్తది కాదు. లాస్ట్ టైమ్ వదిలినవే. కేవలం బర్త్ డే విసెష్ పోస్టర్ వేసి వుంటే సరిపోయేది కదా? మళ్లీ ఈ ఐకాన్ పోస్టర్ ఎందుకు అని బన్నీ ఆరా తీసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -

ఆ డాక్ట‌ర్ పెద్ద‌త‌ప్పు చేశాడు క్ష‌మాప‌ణ చెప్పాలి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?