Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ-పాన్ ఇండియా ఎంట్రీ

బన్నీ-పాన్ ఇండియా ఎంట్రీ

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ లు కాబోతున్నారు. విజయ్ దేవర కొండ అదే లైన్ లో వున్నారు. పూరి సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. బన్నీకి ఎప్పటి నుంచో ఈ పాన్ ఇండియా మీద క్రేజ్ వుంది. సౌత్ ఇండియన్ స్టార్ అని చెప్పుకున్న సందర్భాలు కూడా వున్నాయి. కేరళలో బన్నీకి క్రేజ్ వుంది. కర్ణాటక, తమిళనాడు మన హీరోలందరికీ అంతో ఇంతో మార్కెట్ వుంది. అందువల్ల అది చల్తా.

ఇప్పుడు ఆల్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టినట్లుంది. యూ ట్యూబ్ లో ఎలాగూ బన్నీ నార్త్ ఇండియా జనాలకు బాగానే పరిచయం. అందుకనే సుకుమార్ తో చేసే పుష్ప సినిమా ను అక్కడకి కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లుంది.

సినిమా ఫస్ట్ లుక్ నుంచే ఈ ప్రయత్నాల ప్రారంభించేసారు. ఫస్ట్ లుక్ నుంచే పుష్ప అనే టైటిల్ ను  అన్ని భాషల్లో కంపోజ్ చేయించి ట్విట్టర్ లో చలామణీ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను అన్ని భాషల్లో తయారుచేసి వదిలారు. 

ఇదంతా చూస్తుంటే, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ల కన్నా తానేం తీసిపోయానని, తాను కూడా ఆల్ ఇండియా స్టార్ నే అని చాటే ప్రయత్నం ఇప్పటి నుంచే బన్నీ టీమ్ ప్రారంభించేసినట్లుంది. మొత్తం మీద 2020 లో బాలీవుడ్ లో తెలుగు హీరోల హల్ చల్ స్టార్ట్ అవుతుందేమో?

బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?