Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇదీ సంగతి: భరత్ హిట్ వెనక నందమూరి హీరో!

ఇదీ సంగతి: భరత్ హిట్ వెనక నందమూరి హీరో!

అప్పటివరకు ఒక్క హిట్ లేదు. పైపెచ్చు అన్నీ డిజాస్టర్లు. అలాంటి టైమ్ లో భరత్ అనే నేను వచ్చింది. సూపర్ హిట్ అయింది. అప్పుడు రాని విజయం ఇప్పుడు ఎందుకొచ్చింది? కంటెంట్ లో దమ్ముంది. సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ఇది అందరికీ తెలిసిన లాజిక్. కానీ మరో లాజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.

ఎన్టీఆర్ మేజిక్ టచ్ భరత్ కు కలిసొచ్చిందట. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ యాంగిల్ లోనే ట్వీట్లు, పోస్టులు షురూ చేశారు. కేవలం ఎన్టీఆర్ అనే హీరో 'భరత్ అనే నేను' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు రావడం వల్లనే, ఆ సినిమా అంత పెద్ద హిట్ అయిందని అంటున్నారు తారక్ ఫ్యాన్స్.

భరత్ బహిరంగ సభ పేరిట ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఆ ఈవెంట్ కు ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. అప్పటికే వరుస విజయాలతో ఊపుమీదున్న ఎన్టీఆర్ రావడం వల్లనే.. ఫ్లాపులతో ఉన్న మహేష్ బాబు సక్సెస్ ట్రాక్ పైకి వచ్చాడంటున్నారు ఫ్యాన్స్.

సెంటిమెంట్ పరంగా చూసుకుంటే ఇలాంటివి నమ్మొచ్చు. ఎందుకంటే పరిశ్రమలో అన్నీ సెంటిమెంట్సే కదా. ఈ లెక్కన చూసుకుంటే, తన నెక్ట్స్ సినిమా వేడుకకో, ప్రారంభోత్సవానికో ఎన్టీఆర్ ను మహేష్ మరోసారి ఆహ్వానించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అన్నట్టు ఇదే వేడుకకు రామ్ చరణ్ ను కూడా అహ్వానించారు. కొన్ని కారణాల వల్ల చరణ్ హాజరుకాలేకపోయాడు. చెర్రీ కూడా వచ్చుంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హంగామా చేసేవాళ్లో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?