Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతూ ఛాయిస్ తమన్నానే

చైతూ ఛాయిస్ తమన్నానే

నాగ్ చైతన్య దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాతో వీర బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతోంది. ఇది కాగానే చందు మొండేటి సినిమా ప్రారంభమవుతుందని వినికిడి. హారిక-హాసిని చినబాబు (రాధాకృష్ణ) ఈ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు హీరోయిన్ ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. 

ఒక లైలా కోసం పూజా హెగ్డేను ఎంచుకున్నాడు. మరి ఇప్పుడు ఎవర్ని ఛూజ్ చేస్తాడు నాగ చైతన్య అన్నది క్వశ్చను. రెండు హిట్ లతో తనకు లక్కీ పెయిర్ గా వున్న తమన్నా భాటియానే హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని చైతన్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 100%లవ్, తడాఖా సినిమాల్లో చైతూ సరసన నటించింది తమన్నా ఆ రెండూ హిట్ లే.

 నిజానికి తమన్నా జోడీ దాదాపు అందరు పెద్ద హీరోలకు డిజాస్టర్లే ఇచ్చింది. కానీ చైతూకి కలిసి వచ్చింది. అందుకే మరో సారి జతకట్టాలని అనుకుంటున్నట్లుంది చైతూ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?