Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్‌లో మార్పు తెచ్చిన లాక్‌డౌన్!

త్రివిక్రమ్‌లో మార్పు తెచ్చిన లాక్‌డౌన్!

లాక్‌డౌన్ టైమ్‌లో మన ఫిలింమేకర్లు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, తమ పద్ధతులు మార్చుకోవడానికి వీలు చిక్కింది. విదేశీ చిత్రాలు, సిరీస్‌లు, దేశీయ సిరీస్‌లు, పరభాషా చిత్రాలు చూస్తే తాము ఎంతటి మూస సినిమాలు చేస్తున్నామనేది కూడా మన డైరెక్టర్లు గ్రహించారు. 

మునుపటి కంటే ప్రేక్షకుల అభిరుచి మారిందని, వెరైటీ ఆస్వాదించడానికి సిద్ధంగా వున్నారని తెలుసుకున్నారు.  అందుకే ఒకే మూసలో ఆలోచిస్తోన్న కొందరు దర్శకులు పరిధులు విస్తరించుకునే పనిలో పడ్డారు. 

మేథావి వర్గానికి చెందిన దర్శకుడు త్రివిక్రమ్ ఖలేజా తర్వాత కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టడం మానేసి ఫ్యామిలీ కథలతో కాలక్షేపం చేస్తున్నాడు. ఆ సినిమాలకు వసూళ్లు కూడా బాగా వస్తుండడంతో త్రివిక్రమ్ కంఫర్ట్ జోన్ విడిచి పెట్టడం లేదు. 

కానీ లాక్‌డౌన్ టైమ్‌లో త్రివిక్రమ్ ఆలోచనలు మారాయట. ఇక మీదట యూనివర్సల్ అప్పీల్ వున్న కథలపై దృష్టి పెట్టేందుకు చూస్తున్నాడట. 

దక్షిణాది దర్శకులకు బాలీవుడ్‌లో డిమాండ్ బాగా వుండడంతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సబ్జెక్టులపై ఫోకస్ పెట్టాడని, త్వరలోనే ఆయననుంచి ఒక భారీ పాన్ ఇండియా సినిమా రావచ్చునని  బలంగా వినిపిస్తోంది. 

దర్శకుడిగా మారుతున్న రవితేజ

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?