cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్ కోరిక రాజమౌళి మన్నిస్తారా?

చరణ్ కోరిక రాజమౌళి మన్నిస్తారా?

ఎవరైనా ఎన్నాళ్లు ఓపిక పడతారు. కెరీర్ మొత్తం ఓ సినిమా కారణంగా ఇబ్బందుల్లో పడడమే కాదు, వేరే ప్రాజెక్టులు, వేరే నిర్మాతలు, వేరే హీరోలు కూడా వెయిటింగ్ లిస్ట్ లో అలా వుండిపోతున్నారు. ఇదంతా ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమా వల్లనే. సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరక్టర్లు వెయిటింగ్ లో వుండిపోవడం అంటే కోట్ల ఆదాయం కోల్పోవడమే. మొత్తానికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ వల్ల ఇండస్ట్రీలోని చాలా మందికి జరుగుతున్న నష్టం ఇంతా అంతా కాదు.

ఇలాంటి నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ఇంక మొహమాట పడదల్చుకున్నట్లు లేదు.. అందుకే అందుకే అక్టోబర్, నవంబర్ టైమ్ లో 15 రోజులు ఆచార్య షూట్ మీదకు వెళ్తానని రాజమౌళికి చెప్పినట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు 30 రోజుల వర్క్ వుంది. అందులో 15 రోజులు అక్టోబర్ - నవంబర్ టైమ్ లో చేసే ఆలోచనలో చరణ్ వున్నట్లు తెలుస్తోంది. 

మిగిలిన పదిహేను రోజుల్లో వారం పది రోజులు మెగాస్టార్ కాంబినేషన్ లో వున్నాయని, అది జనవరిలో షూట్ చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఏప్రియల్ 9న ఆచార్య విడుదల చేయాలని తాత్కాలికంగా టైమ్ బౌండ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  అయితే ఇవన్నీ కూడా రాజమౌళి ఓకె అనడం మీద ఆధారపడి వుంటుంది.

రాజమౌళి కనుక రామ్ చరణ్ కు సై అంటే ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటో? ఆయనకు కూడా త్రివిక్రమ్ సినిమా ఓ షెడ్యూలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారా? ఏమో?

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా? 

 


×