చరణ్-ఎన్టీఆర్ అప్పటికి రెడీ

ఆర్ఆర్ఆర్ అంటూ రాజమౌళి సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్-చరణ్. ఇంక వాళ్లని మరో రెండేళ్లు మరిచిపోవచ్చు అని నిర్మాతలు, డైరక్టర్లు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే రాజమౌళి తీసే 200 కోట్లకు పైబడిన సినిమా అంత సులువుగా,…

ఆర్ఆర్ఆర్ అంటూ రాజమౌళి సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్-చరణ్. ఇంక వాళ్లని మరో రెండేళ్లు మరిచిపోవచ్చు అని నిర్మాతలు, డైరక్టర్లు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే రాజమౌళి తీసే 200 కోట్లకు పైబడిన సినిమా అంత సులువుగా, అంత వేగంగా పూర్తికాదు కనుక. అయితే ఫర్ ఏ ఛేంజ్ ఆర్ఆర్ఆర్ వ్యవహారం అలాకాదట.

జనవరి 2020 నుంచి ఏ సినిమా కావాలన్నా ఓకే చేసుకోమని దర్శకుడు రాజమౌళి తన హీరోలు ఇద్దరికీ క్లియరెన్స్ ఇచ్చేసాడట. ఈ ఏడాది నవంబర్ లోగా ఈ సినిమా ఫినిష్ చేసేస్తారట. ఎందుకయినా మంచిది అని ఓ నెల లీన్ పీరియడ్ గా వుంచుకుని, జనవరి నుంచి సినిమాలు ఒప్పుకోమని చెప్పేసాడట.

చరణ్ బ్రిటిష్ ప్రభుత్వ అధికారిగా, ఎన్టీఆర్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. ప్రస్తుతం ఆర్ఎఫ్సీ బయటవేసిన సెట్ లో రోజుకు వెయ్యిమంది పని చేస్తున్నారు. పూణే, కేరళ ఇంకా దేశంలోని చాలా లోకేషన్లలో షెడ్యూళ్లు వున్నాయి.

ఈ సినిమాకు ఒక హీరోయిన్ గా ఆలీయాభట్ ను ఆల్ మోస్ట్ ఎంపిక చేసారు. అగ్రిమెంట్ కావాల్సి వుంది. మరో హీరోయిన్ గా ఫారిన్ అమ్మాయి కావాలి. ఆ వెదుకులాట సాగుతోంది.