గీతాకు పర్మనెంట్ గా వున్న పీఆర్వోలను రామ్ చరణ్ తప్పించిన వైనం మెగా కాంపౌండ్ లో కాస్త గట్టి హడావుడే చేసినట్లు తెలుస్తోంది. ఆ సంగతి అలా వుంచితే, ధృవ ప్రారంభం నుంచే చరణ్ తో మేనమామ అరవింద్ కాస్త ఇబ్బందులు ఎదుర్కోన్నట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అరవింద్ కు బాగా నమ్మకమైన ఓ కో డైరక్టర్ ను ధృవ సినిమాకు పెట్టారట. అయితే గీతా స్టాఫ్ వీలయినంత మంది తన సినిమాకు వుండకూడదనే ఆలోచనతో చరణ్ ఆ కో డైరక్టర్ ను వద్దని పంపించేసారని టాక్.
కాశ్మీర్ ఎపిసోడ్ అనంతరం ధృవకు పని చేసేవారిలో కొంత మార్పులు చేర్పులు జరిగాయట. అయితే ఇంటి విషయం కావడంతో అరవింద్ మరేమీ చెప్పలేక సైలెంట్ అయ్యారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఈ విషయాలు నిజమో కాదా అన్న డిస్కషన్లు వుండనే వున్నాయి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. మెగా కాంపౌండ్ లో జరుగుతున్న వ్యవహారాలన్నీ ఇప్పుడు ఫ్యాన్స్ నడుమకు వచ్చేసాయని, వాళ్లు వారి వారి అభిప్రాయాలను నిర్మొహమాటంగా మెగా ఫ్యామిలీ దృష్టికి తీసుకువెళ్లారని వినికిడి.
ఇది తెలిసి, ఇప్పుడు చరణ్ దగ్గరున్న ఆ ఇద్దరు డ్యామేజ్ కంట్రోల్ కు చర్యలు ప్రారంభించినట్లు వినికిడి. ధృవ యూనిట్ మార్పులు చేర్పులు అన్నీ చరణ్ కు తెలియకుండా జరిగాయని వార్తలు వ్యాపింపచేసే పని స్టార్ట్ చేసినట్లు వినికిడి. ఏమయినా, సినిమా మీద, విజయాల మీద దృష్టి పెట్టకుండా, ఇలాంటి విషయాలపై చరణ్ దృష్టి పెడితే మాత్రం అది సరైన ప్లానింగ్ అనిపించుకోదు.