Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిట్టి...నా బుల్ బుల్ చిట్టి

చిట్టి...నా బుల్ బుల్ చిట్టి

ఈ మధ్య సినిమా పాటలు రెండు రకాలుగా మారిపోయాయి. సినిమా లెవెల్ ను బట్టి భారీగా, హడావుడిగా, ఒకరకం. కొత్త తరహా చిన్న సినిమాల కోసం సున్నితంగా, సుతారంగా మరో రకం.

యువ సంగీత దర్శకులు ఇలాంటి సున్నితమైన ట్యూన్ లు అందిస్తున్నారు. వీటిల్లో వాయిద్య ఘోష పెద్దగా వుండదు. బాక్స్ లు బద్దలయి పోయి, చివులు చిల్లులు పడిపోయేంత సౌండూ వుండదు.

అలాంటి పాట మరోటి వచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విని నిర్మాతగా మారి అందిస్తున్న జాతి రత్నాలు సినిమా నుంచి ఓ మంచి పాట బయటకు వచ్చింది. రామ్ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట తేలికపాటి పదాలతో, సాదా ట్యూన్ తో భలేగా వుంది.

'చిట్టీ నీ నవ్వంటే లక్ష్మీ పటాసే, ఫట్ మని పేలిందా నా గుండే ఖల్లాసే' అంటూ ప్రారంభమయ్యే పాటలో సాదా సీదా పదాలే అయినా, భలేగా ఇమిడిపోయాయి.  ట్యూన్ కోత్తగా లేదు. 

గతంలో విన్న ట్యూన్ మాదిరిగానే వుంది కానీ ఆ ట్యూన్ కు ఇచ్చిన బీట్, రామ్ జోగయ్య సాహిత్యం కలిసి పాటను కొత్తగా, కొన్నాళ్లు వినిపించేలా మార్చేసాయి. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?