Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమాలు క్యూ కడుతున్నాయి

సినిమాలు క్యూ కడుతున్నాయి

క్రాక్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ టాలీవుడ్ నిర్మాతల అనుమానాలు పటాపంచలు చేసింది. కరోనా తరువాత థియేటర్లకు జనం వస్తారా? రానా? అన్న అనుమానం ఇన్నాళ్లు నిర్మాతలను వెంటాడింది. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. 

ఆకలితో వున్నవాళ్లు అన్నం మీద పడినట్లు, జనం థియేటర్ల మీదకు ఎగబడ్డారు. ఓటిటిలను పక్కకు తోసి థియేటర్లకు పరుగులెత్తారు. దీంతో ఈ సమయం కోసమే వెయిటింగ్ లో వున్న సినిమాలు క్యూ కడుతున్నాయి. 

ఈ 23న అల్లరి నరేష్ బంగారు బుల్లోడు, 29న ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా', ఆ పైవారం ప్రశాంత్ వర్మ  జాంబిరెడ్డి సినిమాలు డేట్ లు ప్రకటించేసాయి. 

వీలయితే ఫిబ్రవరిలోనే తమ సినిమా కూడా విడుదల చేయాలని ఉప్పెన నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రెడీ అయింది. అది విడుదల చేసే టైమ్ లో డేట్ ప్రకటించే అవకాశం వుంది. 

మార్చినెల ఇప్పటికే చాలా సినిమాలు డిసైడ్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, నితిన్ రంగ్ దే వున్నాయి. వకీల్ సాబ్ ఏప్రిల్ 2 కు డేట్ మార్చుకుంటోందని బోగట్టా. వకీల్ సాబ్ కనుక మార్చి  2 కు వస్తే రంగ్ దే మార్చి 11 కు వచ్చే అవకాశం వుంది.

భవ్య నిర్మించిన చంద్రశేఖర్ యేలేటి - నితిన్ చెక్ కూడా స్లాట్ కోసం చూస్తోంది. ఇవి కాక ఈ వారంలో మరిన్ని సినిమాల డేట్ లు వెల్లడయ్యే అవకాశం వుంది. 

దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?