Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘దేశా’నికి సినిమా జనాల చురకలు

‘దేశా’నికి సినిమా జనాల చురకలు

కోరి కెలక్కున్నట్లు వుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఆ పార్టీ నాయకులు సినిమా జనాలను రెచ్చగొట్టారు. మీరేం హీరోలు, మీరేం గొప్ప, జల్లి కట్టు గురించి మాట్లాడిన వాళ్లు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరేం అంటూ. అంతటితో ఊరుకోకుండా కాస్త గట్టి విమర్శలే చేసారు. దీంతో సినిమా జనాల నుంచి ఇంకో రకమైన రియాక్షన్ వస్తోంది. హోదా మీద మాట్లాడడం పోయి, రివర్స్ అవుతున్నారు.

నిన్నటికి నిన్న కత్తి మహేష్ ఓ దులుపు దులిపారు. అంతా మీ హీరోలే కదా? మళ్లీ ఇలా ఎందుకు అడగడం, అవార్డులు ఇచ్చుకున్నారు కదా? ఇప్పుడు మళ్లీ ఇలా అంటారేం అనే టైపులో చరుకలు  అంటించారు.

ఇప్పుడు తరువాయి భాగం తమ్మారెడ్డి భరద్వాజ తీసుకున్నారు.  అందాలను ఆరబోయించి, తైతక్కలాడే హీరోలు మీ పక్కనే వున్నారు కదా? వాళ్లకు చెప్పండి హోదా మీద మాట్లాడమని అంటూ చురకేసారు. అవార్డులు పంచినపుడు మీకు సినిమా జనాలు అందరూ కనిపించలేదా? ఇప్పుడు కావాల్సి వచ్చందా అని కూడా స్ట్రయిట్ గా అడిగేసారు.

అసలు హోదా కన్నా పవన్-జగన్-మోడీ ఎక్కడ కలిసిపోతారో అన్న భయమే ఎక్కువగా వుందని తమ్మారెడ్డి నేరుగా అనడం అంటే కాస్త ఆలోచించాల్సిన  విషయమే. హోదా సాధ్యంకాదని మోడీ చెప్పాక, గమ్మున ఊరుకున్న చంద్రబాబు ఇఫ్పుడు మళ్లీ హొదా గురించి గొంతెత్తడం వెనుక వైనం ఇదికాక మరేంటని నిలదీసారు.

ఎప్పుడైతే ఇలాంటి రియాక్షన్ సినిమా వాళ్ల దగ్గర నుంచి వచ్చిందో, ఇక మళ్లీ సినిమా జనాలను హోదా మీద మాట్లాడమనే ధైర్యం తెలుగుదేశం జనాలు చేయకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?