దేవదాస్ సినిమా విడుదలకు దగ్గరయింది. ఈ సినిమాను నైజాంను 11 కోట్లకు అమ్మినట్లు వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం వేరే వున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆంధ్ర, నైజాంల్లో నిర్మాత అశ్వనీదత్ నే స్వంతంగా విడుదల చేసుకుంటున్నారు.
నైజాంలో తన చిరకాల మిత్రుడు ఏషియన్ సునీల్ ద్వారా విడుదల చేస్తున్నారు. జస్ట్ 10కోట్ల రిటర్నబుల్ అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. మిత్రుడు కాబట్టి, టన్ పర్సంట్ కమిషన్ మీద పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కానీ అవుట్ రేట్ న 11 కోట్లకు కొన్నారన్న వార్తలు కరెక్ట్ కాదని తెలుస్తోంది.
ఇక ఆంధ్రలో కూడా ఆల్ మోస్ట్ స్వంతంగానే పంపిణీ చేసుకుంటున్నారు. నెల్లూరు మాత్రమే అమ్మినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ ఏరియాను మాత్రం ఇచ్చేసారు. అందువల్ల దేవదాస్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇంత జరిగింది అని చెప్పడానికి లేదు. అశ్వనీదత్ కు వున్న అనుభవం, స్నేహాలు, పరిచయాల వల్ల అడ్వాన్స్ లకు లోటు వుండదు. కానీ సినిమా వసూళ్లను బట్టే రెండు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది అన్నది వుంటుంది.
నైజాంలో అప్పుడే ఏసియన్ వెబ్ సైట్ లో బుకింగ్ లు ప్రారంభించారు. ఓపెనింగ్స్ బాగానే వుండేటట్లు కనిపిస్తోంది, టికెట్ లు తెగుతున్న ట్రెండ్ చూస్తుంటే.