దిల్ రాజు భుజాలపై నోటా బాధ్యతలు

అవసరం మనది అయినపుడు ఏమయినా చేయాలి. ఎంతయినా చేయాలి. తప్పదు. నిర్మాత దిల్ రాజు పరిస్థితి ఇప్పుడు ఇదే అని తెలుస్తోంది. తను నిర్మించిన రామ్-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ సినిమా హలోగురూ ప్రేమకోసమే. ఈ…

అవసరం మనది అయినపుడు ఏమయినా చేయాలి. ఎంతయినా చేయాలి. తప్పదు. నిర్మాత దిల్ రాజు పరిస్థితి ఇప్పుడు ఇదే అని తెలుస్తోంది. తను నిర్మించిన రామ్-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ సినిమా హలోగురూ ప్రేమకోసమే. ఈ సినిమా విడుదల అక్టోబర్ 18న. దీనికి అడ్డం రాకూడదని, విజయ్ దేవరకొండ 'నోటా' సినిమాను అక్టోబర్ 5కు ఫిక్స్ అయ్యేలా చేసారు దిల్ రాజు.

కానీ సమస్య ఏమిటంటే, నోటా సినిమా పనులు ఇంకా చాలా పెండింగ్ లో వున్నాయి. నోటా సినిమాకు సంబంధించి తెలుగు టైటిల్ వ్యవహారాలు ఏవో పెండింగ్ లో వున్నాయని వినికిడి. అలాగే అన్నిపనులు ఫినిష్ చేయించి, సెన్సారు ముందుకు తేవాలి. అంతా కలిపి పట్టుమని పదిరోజులు టైమ్ లేదు. అందులో చివరి మూడురోజులు ఏలాగూ తీసేయాలి. అంటే గట్టిగా వారం మాత్రమే వుంది.

ఈలోపు నోటా పనులు ఫినిష్ చేయించే బాధ్యత తనది అని దిల్ రాజు తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. జ్ఞాన్ వేల్ రాజా కూడా వచ్చి హైదరాబాద్ లో కూర్చున్నారు. కానీ ఆయన పబ్లిసిటీ వ్యవహారాలు చూసుకోవడంలో బిజీగా వున్నారు. దిల్ రాజు ఈ పనులు తను ఖాతాలో వేసుకున్నారు.