Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజుకే పెద్ద దెబ్బ

దిల్ రాజుకే పెద్ద దెబ్బ

లాక్ డౌన్ అనేది టాలీవుడ్ మీద గట్టిగా పడింది. వర్కర్ల సంగతి, టాలీవుడ్ మీద ఆధారపడిన వారి సంగతి పక్కన పెడితే నిర్మాణ సంస్థంలో అతి పెద్ద దెబ్బ దిల్ రాజుకే తగిలినట్లు కనిపిస్తోంది. నిర్మాతగా ఆయన వి సినిమా విడుదలకు రెడీ గా వుంది. దాదాపు నలభై కోట్ల బెట్. మరోపక్క వకీల్ సాబ్ నిర్మాణంలో వుంది. ఇప్పటికే దాని మీద అన్నీ కలిపి ముఫై కోట్ల వరకు పెట్టేసారని తెలుస్తోంది. ఇంకో పక్క 15 కోట్ల రూపాయిలు ఆర్ఆర్ఆర్ కు అడ్వాన్స్ గా చెల్లించేసారు.

వి సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. ముఖ్యంగా ఓవర్ సీస్ లో థియేటర్లు కనీసం మరో మూడు నెలల వరకు తెరుచుకోవు అని వినిపిస్తోంది. వకీల్ సాబ్ సినిమా వర్క్ ఇంకా కనీసం 40 రోజులు వుంది. ఇండస్ట్రీ రోటీన్ పడ్డాక కానీ అది మొదలు కాదు. అది ఎప్పుడు అన్నది తెలియదు. 

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సంగతి అలా వుంచితే ఎగ్జిబిటర్ గా దిల్ రాజుకు ముఫై థియేటర్ల వరకు చేతిలో వున్నాయి. చాలా వరకు గ్రౌండ్ లీజులో వున్నవే. ఇప్పుడు ఈ నెలలో దాదాపు 15 రోజులు ఎటువంటి ఆదాయం లేకుండానే జీతాలు చెల్లించాలి. ఇదంతా అదనపు భారమే.

హారిక హ్యాపీ

పెద్ద నిర్మాణ సంస్థలో ఒకటైన హారిక హాసిని సంస్త ఫుల్ హ్యాపీ,. రెండు హిట్ లు కొట్టి వున్నారు. సినిమాలు ఏవీ నిర్మాణంలో పెద్దగా లేవు. నితిన్ రంగ్ దే మాత్రమే సెట్ మీద వుంది. పెద్ద బడ్జెట్ కాదు.

మైత్రీ సంస్థ ఉప్పెన మీద మాత్రమే పెట్టుబడి పెట్టివుంది. మరే సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. అందువల్ల డెడ్ క్యాపిటల్ ఏదీ లేదు. ఉప్పెన డబ్బులు రికవరీ కావాలంతే.

గీతా సంస్థలో అఖిల్ సినిమా బ్యాచులర్ ఒక్కటే సెట్ మీద వుంది మరీ ఎక్కువ బడ్జెట్ కాదు. భోగవిల్లి ప్రసాద్ సోలో బతుకే సోబెటర్ మూడు వంతలు పూర్తయింది. ఆయనకు అది కాస్త ఇబ్బందే.

అన్నపూర్ణలో సినిమాలు ఏవీ లేవు. సురేష్ లో నారప్ప ఒక్కటే ఆగింది. ఇలా దాదాపుగా ఇండస్ట్రీలో నిర్మాతలు ఎవ్వరికీ మరీ భయంకరమైన బర్డెన్ లేదు దిల్ రాజుకు తప్పిస్తే.

ఇంట్లో నేతి దీపాలు వెలిగించాలా?

మేము సైతం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?