Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు కు మహేష్ నో...?

దిల్ రాజు కు మహేష్ నో...?

అన్నీ అనుకూలించి వుంటే వంశీ పైడిపల్లి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా మహేష్ సినిమా వుండి వుండాలి. కానీ సరైన కథ తయారుచేయలేక, వంశీ పైడిపల్లి.. ఆహా..అనిపించుకోలేకపోయారు.

దాంతో నిర్మాతగా దిల్ రాజుకు చాన్స్ లేకుండా అయిపోయింది. అయితే ప్రస్తుతం మహేష్ లైనప్ లో రెండో సినిమా ఏదీ ఇదీ అంటూ ఫిక్స్ కాలేదు.

అందుకే ఇటీవల దిల్ రాజు వెళ్లి మహేష్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఓ సినిమా చేసుకుంటాను అని అడిగినట్లు బోగట్టా. కానీ దానికి మహేష్ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. మహేష్ మదిలో తివిక్రమ్ సినిమా, ఆపై రాజమౌళి సినిమా వుండడమే కారణం కావచ్చు. 

మరోపక్కన రామ్ చరణ్-వంశీ పైడిపల్లి సినిమా సెట్ చేయాలని కూడా దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడా వర్కవుట్ కావడం లేదని బోగట్టా. 

ప్రభాస్ తో సినిమా చేయాలనుకుని, దర్శకుడు దశరథ్ ను అక్కడకు పంపారు. కానీ ఒకప్పుడు దశరథ్ తో సినిమా చేసి వున్నా, ఇప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు. అందుకే ఆయన కూడా ఊ అనకుండా ఊరుకున్నారు. 

పిల్లలతో పిల్లాడిలా జగన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?