cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా?

ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా?

కొన్ని కొన్ని కాంబినేషన్లు క్రేజీగా వుంటాయి. అయితే ఊరమాస్ కావచ్చు లేదా వీర క్లాస్ కాంబినేషన్ కావచ్చు. అవసరాల శ్రీనివాస్ క్లాస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తీయడంలో దిట్ట. జ్యో అచ్యుతానంద సినిమా తరువాత మళ్లీ సరైన ప్రాజెక్టు కోసం చూస్తున్నారు. నిర్మాతలు రెడీ. హీరోలు, కథలే సెట్ కావడంలేదు.

సాయి కొర్రపాటికి ఓ సినిమా చేయాలి. కానీ ఆయన ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ మీద బిజీ గా వున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఓ సినిమా చేయాలి. కథ సెట్ కావడంలేదు. ఆఖరికి ఇప్పుడు వైజయింతీ మూవీస్ దగ్గర తేలారు. మాంచి కథను హీరో శర్వానంద్ కు చెప్పాలని చూస్తున్నారు.

శర్వానంద్ కూడా క్లాస్ కామెడీ భలేగా పండిస్తాడు. అవసరాలకు సరైన కాంబినేషన్ అనే చెప్పాలి. ఎటొచ్చీ ప్రస్తుతం మరో రెండు మూడునెలలు సుధీర్ వర్మతో చేసే సినిమా మీద బిజీగా వుంటాడు. ఆ తరువాత సమంత హీరోయిన్ గా దిల్ రాజు కోసం చేసే 96 సినిమా మీదకు వెళ్తాడు. ఆ తరువాత చేయాలి ఏది ఒకె చేసినా.

అయితే ప్రస్తుతానికి కథ ఒకె చేయించుకునే పనిలో వున్నారు అవసరాల శ్రీనివాస్. కథ కనుక ఒకె అయితే ఓ ఆర్నెల్లు వెయిట్ చేయడం పెద్ద విషయం కాదు. పైగా వైజయంతీ సంస్థ కూడా ఆసక్తిగానే వుంది. ఈ క్లాస్ కాంబినేషన్ సెట్ చేసి ఓ సక్సెస్ కొట్టాలని.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్