Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎక్కడ అంకెలు అక్కడ గప్ చుప్

ఎక్కడ అంకెలు అక్కడ గప్ చుప్

వకీల్ సాబ్ వ్యవహారం ఇంకా సంచలనంగానే వుంది. డిస్ట్రిబ్యూటర్లకు గట్టి ఆదేశాలు వెళ్లాయి. ఒక్క అంకె కూడా బయటకు చెప్పడానికి వీల్లేదని. ఏవో అంకెలు బయటకు వస్తున్నాయి కానీ ఏవీ పెర్ ఫెక్ట్ కాదు. వాటి కన్నా ట్విట్టర్ లో ఫ్యాన్స్ టౌన్స్ వారీగా పెర్ ఫెక్ట్ ఫిగర్లు పోస్ట్ చేస్తున్నారు. అవే కరెక్ట్ గా వున్నాయి. 

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం నైజాం ఏడు కోట్లకు కాస్త అటు ఇటుగా, గుంటూరు, ఈస్ట్ మూడు కోట్లకు కాస్త పైగా వసూళ్లు సాగించినట్లు తెలుస్తోంది.  

ఆ రెండు ఏరియాలు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రేంజ్ లో విక్రయించారు. విశాఖ లో కూడా మూడు కోట్ల మేరకు చేసినట్లు బోగట్టా. ఇక్కడ టోటల్ రన్ లో పదిన్నర కోట్ల వరకు చేయాల్సి వుంది. 

ఫిగర్లు దాచేయడానికి కారణం రేట్లు, షో లతో వచ్చిన గడబిడ అని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. కానీ దానికీ ఫిగర్లు దాచడానికి ఏమిటి? సంబంధం అన్నది తెలియదు. 

గతంలో డిజె ఫిగర్ల విషయంలో దిల్ రాజుకు సమస్య అయింది. ఫ్యాన్స్ వార్, హీరోలతో సంబంధాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన అంకెలు బయటకు వచ్చి. నానా రభస కాకుండా ముందుగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?