Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఏంట'మ్మా'.. మా.. ఇలా

ఏంట'మ్మా'.. మా.. ఇలా

మా అంటే నటీనటులు అందరూ కలిసి ఏర్పాటుచేసుకున్న సంఘం. సభ్యుల సంక్షేమం, కార్యవర్గం పార్టీలు, కాక్ టైల్ హడావుడులు, సన్మానాలే కాదు. కాస్త సంతాపాలు కూడా చూడాలి.

గుండు హనుమంతరావు లాంటి సీనియర్ కమెడియన్ మరణిస్తే, ఓ నివాళి లేకపోతే ఎలా? కనీసం కార్యవర్గ సభ్యులు నలుగురు ఓ చోట చేరి, గుండు హనుమంతరావు ఫోటొకు ఓ దండ వేసి రెండు నిమషాలు కనీసం మౌనం పాటించవచ్చు కదా? పోనీ నాలుగు గోడల మధ్య అలా చేసారేమో అనుకోవడానికి కూడా లేదు.

ఎందుకంటే మా సభ్యులు ఏం చేసినా, అరడజనుకు పైగా ఫొటోలతో ప్రెస్ నోట్ వస్తుంది. సిఎమ్ పక్కన మేము, మినిస్టర్ పక్కన మేము, ఇలా రకరకాలుగా. అలాంటిది గుండుహనుమంతరావు వైనం మరిచిపోయారు.

పైగా అదే రోజు కళాతపస్వి విశ్వనాధ్ పుట్టిన రోజు వేడుకలు, సన్మానం జరిపారు. అది ముందుగా ప్లాన్ చేసి వుండొచ్చు. కానీ గుండు హనుమంతరావు మరణించారని తెలిసాక క్యాన్సిల్ చేయాలి కదా? అది కూడా చేయలేదు. విశ్వనాధ్ గారైనా, ఈ వార్త తెలిసి క్యాన్సిల్ చేయమని చెప్పాలి కదా?

సిల్వర్ జూబ్లీ అంటూ హల్ చల్ చేస్తూ, పార్టీలు చేసుకుంటూ, మీడియాకు కూడా పార్టీలు పోసేస్తూన్న మా సభ్యులు ఇలాంటి కీలక విషయం మరచిపోవడం ఏమిటో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?