Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎక్స్ క్లూజివ్.. రాధేశ్యామ్ మరో గీతాంజలి!

ఎక్స్ క్లూజివ్.. రాధేశ్యామ్ మరో గీతాంజలి!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్ చేయి చూసి జాతకాలు చెప్పే వ్యక్తిగా కనిపించబోతున్నాడనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇదివరకే వెల్లడించింది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో ఎక్స్ క్లూజివ్ మేటర్ అందిస్తున్నాం.

రాధేశ్యామ్ సినిమాలో గీతాంజలి యాంగిల్ ఉంది. చావు-పుట్టుక మధ్య నడిచే ఈ కథలో హీరోహీరోయిన్లలో ఒకరికి ప్రాణ భయం ఉంటుంది. ఎవరు ప్రాణాలు కోల్పోయారు.. ఎవరు బతికి బయటపడ్డారు.. లేదంటే ఇద్దరూ బతికారా అనేది సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్.

నిజానికి ఈ సినిమా మోషన్ పోస్టర్ లోనే చాలా కథను బయటపెట్టారు. కాకపోతే ఆ విషయాల్ని ఊహించడం చాలా కష్టం. సినిమా చూసిన తర్వాత మోషన్ పోస్టర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. 

సినిమాలో ప్రభాస్ పాత్రతో సమానంగా పూజాహెగ్డే క్యారెక్టర్ ఉంటుంది. ఒక దశలో (సెకెండాఫ్) పూజా హెగ్డే పూర్తిగా సినిమాను డామినేట్ చేస్తుంది.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. జులై 30న ఈ సినిమాను తెలుగు-హిందీ-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?