అదిగో పులి అంటే ఇదిగో తోక అనేయడం ఇటీవల అలవాటైపోయింది. మహేష్ బాబు జేమ్స్ బాండ్ సినిమా చేయబోతున్నాడంటూ ఇటీవల వచ్చిన రూమర్ అలాంటిదే. ఒకర్ని చూసి మరొకరు అదే దోవ పోయారు. కానీ అది వాస్తవం కాదని, అసలు వ్యవహారం వేరని తెలుస్తోంది.
వంశీ పైడిపల్లి సినిమాలో మహేష్ బాబు చేయబోతున్నది గ్యాంగ్ స్టర్ పాత్ర అని తెలుస్తోంది. కానీ గ్యాంగ్ స్టర్ లాంటి రఫ్ క్యారెక్టర్ ను బాబు చేస్తారా? అన్నది అనుమానం. కానీ వంశీ పైడిపల్లి ఈ గ్యాంగ్ స్టర్ పాత్రను కాస్త టిపికల్ స్టయిల్ టచ్ తో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే ఓ విధంగా రాబిన్ హుడ్ టైప్ అనుకోవాలేమో? వంశీ పైడిపల్లి దర్శకత్వలో దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తారు. మే లేదా జూన్ నుంచి సెట్ మీదకు వెళ్లే ఈ సినిమా 2021 సమ్మర్ కు విడుదలవుతుంది.