ఎఫ్ 3..మూడు వాటాలు

ఎఫ్ 2. నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో పెద్ద హిట్. ఫిదా, ఎఫ్ 2 లాంటి సినిమాలు దిల్ రాజుకు ఇచ్చిన డబ్బులు ఇన్నీ అన్నీ కావు.  ఇలాంటి నేపథ్యంలో ఎఫ్ 3…

ఎఫ్ 2. నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో పెద్ద హిట్. ఫిదా, ఎఫ్ 2 లాంటి సినిమాలు దిల్ రాజుకు ఇచ్చిన డబ్బులు ఇన్నీ అన్నీ కావు.  ఇలాంటి నేపథ్యంలో ఎఫ్ 3 సినిమా ప్రకటించేసారు.

ఇది ప్రకటించిన తరువాత అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా చేసారు. ఎఫ్ 3 స్టార్ట్ చేయాలని చకచకా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసారు. కానీ కరోనా వచ్చి బ్రేక్ వేసేసింది.

ఇప్పుడు పోస్ట్ కరోనా నేఫథ్యంలో విక్టరీ వెంకటేష్ నారప్ప, వరుణ్ తేజ్ బాక్సర్ పూర్తి చేసుకుని వస్తే ఎఫ్ 3 స్టార్ట్ చేయాలి. ఇదిలా వుంటే ఎఫ్ 3 సినిమా కోసం హీరో వెంకటేష్ డేట్ లు సంపాదించడం అంత వీజీ కాలేదని తెలుస్తోంది. వెంకీ సోదరుడు సురేష్ బాబు దగ్గర బేరం అంత సులువుగా తెగలేదని తెలుస్తోంది. పైగా వెంకీ లేకుంటే సినిమా వుండదని తెలుసుగా. 

ఆఖరికి కొద్దిగా రెమ్యూనిరేషన్, కొద్దిగా ఫ్రాఫిట్ షేరింగ్ ప్రాతిపదికన డీల్ కుదిరినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇదిలా వుంటే ఇదే తరహా డీల్ డైరక్టర్ అనిల్ రావిపూడి తో కూడా సెట్ అయినట్లు బోగట్టా.

ఆ విధంగా ఎఫ్ 3 సినిమా లాభాలకు ముగ్గురు వాటాదారులు కుదిరినట్లు అయింది. ఈ సినిమా జనవరిలో ప్రారంభమవుతుందని అంచనా.

ఈ విష‌యంలో సీజేఐ మౌనాన్ని వీడ‌టం మంచిది