Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గీతగోవిందంపై ఫిర్యాదు?

గీతగోవిందంపై ఫిర్యాదు?

బన్నీ వాస్ నిర్మాతగా ముస్తాబవుతున్న సినిమా గీతగోవిందం. విజయ్ దేవరకొండ కథానాయకుడు. ఆగస్టు 15న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాపై ఇప్పుడు కాపీ ముద్రపడింది. ఈ మేరకు రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు నమోదు అయినట్లు, విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో ఎప్పటి నుంచో వుంటున్న నివాస్ అనే వ్యక్తి ఈ కథ తనదే అని, గతంలో తాను జోగినాయుడు(కమెడియన్) హీరోగా తీసే ప్రయత్నం చేసినట్లు, మధ్యలో ఆగిపోయిందన్నది నివాస్ వెర్షన్. అప్పట్లో తాను అనుకున్న పేరు, తన రచనకు పెట్టిన పేరు వర్జిన్ అంట.

అయితే దర్శకుడు పరుశురామ్ కు జోగినాయుడుకు సాన్నిహిత్యం వుండడంతో, అలా ఆ కథ అక్కడకు వెళ్లి వుండవచ్చని నివాస్ అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు రైటర్స్ అసోసియేషన్ ఇరువర్గాలను పిలిపించి మాట్లాడే ప్రయత్నంలో వున్నట్లు తెలుస్తోంది.

గీతగోవిందం సినిమా ప్రచారం ఇటీవలే మొదలైంది. అందులోని ఓ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రచార చిత్రాలకు, స్టిల్స్ కు మాంచి బజ్ వచ్చింది. ఇలాంటి టైమ్ ఇలా ఆటకం రావడం విశేషం. మరి ఏ విధంగా పరిష్కారం అవుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?