Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గోదావరి జిల్లా నుంచి రవితేజ

గోదావరి జిల్లా నుంచి రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ మరోసారి పల్లె నుంచి పట్నానికి వచ్చి విలన్ ను ఢీకోనే హీరోగా కనిపించబోతున్నాడు. సంపత్ నంది డైరక్షన్ లో తయారవుతున్న బెంగాల్ టైగర్ లో హీరో రవితేజ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే యువకుడి పాత్ర పోషిస్తున్నాడు.

గతంలో కూడా కృష్ణ లంక చందు అంటూ హైదరాబాద్ వచ్చి ప్రకాష్ రాజ్ తో ఓ రేంజ్ లో ఆడుకుంటాడు. ఇప్పుడు బోమన్ ఇరానీతో ఆడుకో బోతున్నాడు. బెంగాల్ టైగర్ సినిమా దాదాపు పూర్తయింది.రెండు పాటలు, కొద్దిగా ప్యాచ్ వర్క బ్యాలన్స వుంది.

ఎలాగైనా దసరా బరిలోకి దిగి తీరాలన్నది యూనిట్ ఆలోచన. రవితేజ సరసన తమన్నా, రాశిఖన్నా నటిస్తున్నారు. సంపత్ నంది రచ్చ సినిమాలో తమన్నా హీరోయిన్. ఆ సినిమా సూపర్ హిట్. అదే సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందన్న హోప్ తో వున్నారు.

ఈ సినిమా థీమ్ సాంగ్ కు కన్నడ డైరక్టర్ హర్ష డ్యాన్స్ డైరక్షన్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజకు, హర్షకు వున్న బంధంతో ఆయన ఈ డ్యాన్స్ డైరక్షన్ కు పూనుకున్నారు. హంసానందిని ఈ పాటలో రవితేజ సరసన ఆడిపాడింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?