హెయిర్ స్టయిలిష్ ఖర్చు లక్షల్లో..

ఈ మధ్య మన టాప్ హీరోల రెమ్యూనిరేషన్ కన్నా, అదనపు ఖర్చులుపెరిగిపోతున్నాయి. స్టయిలిష్ లు, హెయిర్ స్టయిలిష్ లు, కాస్ట్యూమ్ లు ఇలా సమస్తం.  Advertisement చాలా వరకు టాప్ యంగ్ హీరోలు అంతా…

ఈ మధ్య మన టాప్ హీరోల రెమ్యూనిరేషన్ కన్నా, అదనపు ఖర్చులుపెరిగిపోతున్నాయి. స్టయిలిష్ లు, హెయిర్ స్టయిలిష్ లు, కాస్ట్యూమ్ లు ఇలా సమస్తం. 

చాలా వరకు టాప్ యంగ్ హీరోలు అంతా తమ తమ స్టయిలిష్ ల కోసం ముంబాయి మీద ఆధారపడుతున్నారు. వాళ్లు రోజుకు లక్షల్లో చార్జ్ చేస్తున్నారు. పైగా రాను పోను భారీ ఖర్చులు కూడా. 

శంకర్-రామ్ చరణ్ సినిమా కోసం హెయిర్ స్టయిలిష్ ను ముంబాయి నుంచి రప్పిస్తున్నారట. వచ్చినపుడు రోజుకు లక్షన్నర రెమ్యూనిరేషన్, రాను పోను బిజినెస్ క్లాస్ టికెట్ లు, ముగ్గురు సిబ్బంది, వారి టికెట్ లు, వీరందరికీ లోకల్ స్టార్ హోటల్ అకామిడేషన్ ఇలా వుంటుందట వ్యవహారం. 

కేవలం రామ్ చరణ్ అని మాత్రమే కాదు, మిగిలిన టాప్ హీరోలు చాలా మంది ఇదే వ్యవహారం. అలవైకుంఠపురంలో సినిమా టైమ్ లో కూడా బన్నీ స్టయిలిష్ ల ఖర్చు మామూలుగా కాలేదని బోగట్టా.  టాలీవుడ్ లో హీరోల రెమ్యూనిరేషన్లకు ఇలాంటి స్థానిక పన్నులు అదనం. 

కానీ ఇందుకోసం రేట్లు పెంచేయాలి. జనాల్ని పిండేయాలి. అలా రేట్లు ఇవ్వకపోతే ప్రభుత్వాల్ని దుయ్య బట్టాలి.