Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హారిక నుంచి పాన్ ఇండియా వెబ్ సిరీస్

హారిక నుంచి పాన్ ఇండియా వెబ్ సిరీస్

ఆ మధ్య ఓటిటి లో వచ్చిన ఫ్యామిలీమన్, పాతాళలోక్ లాంటి వెబ్ సిరీస్ లు అన్ని ప్రాంతాల జనాలను బాగా ఆకట్టుకున్నాయి. తెలుగులో కూడా మంచి వెబ్ సిరీస్ లు తీయాలని చాలా మంది రకరకాలుగా ప్రయత్నించారు. కానీ దాదాపు అన్నీ విఫలమయ్యాయి. 

పెద్దా చిన్నా డైరక్టర్లు ట్రయ్ చేసారు కానీ సక్సెస్ కాలేకపోయారు. దీనికి అనేక కారణాలు వున్నాయి. బడ్జెట్ సమస్య, సరైన స్టార్ కాస్ట్ కుదరకపోవడం, సరైన కథ కథనాలు లేకపోవడం ఇలా ఒక్కోదానికి ఒక్కోసమస్య.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, పాన్ ఇండియా లెవెల్ లో అదే విధంగా కాస్త గట్టి బడ్జెట్ తో ఓ వెబ్ సిరీస్ ను తేవాలని ప్రామినెంట్ నిర్మాణ సంస్థ హారిక హాసిని అనుబంధ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ఠ్ వర్క్ పూర్తయింది. ఎనిమిది ఎపిసోడ్ ల రైటింగ్ వర్క్ పూర్తయింది. 

తొలిప్రేమ, మజ్ఞు, రంగ్ దే సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్టుకు సూత్రధారి. ముందుగా నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద ఓటిటి నుంచి అప్రూవల్ తీసుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఒకసారి స్క్రిప్ట్ అప్రూవల్ వచ్చేస్తే స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ వగైరా పనులు పూర్తి చేసి ముందుకు వెళ్తారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రయిమ్ ల్లో వచ్చిన వెబ్ సిరీస్ ల క్వాలిటీకి తీసిపోని లెవెల్ లో దీన్ని తయారుచేయాలన్నది సితార అధినేతల ఆలోచన.

కాపుల మధ్య కుల రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?