హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేదు. కెరీర్ లో గ్యాప్ లేకుండా చూసుకోవడం ఒక్కటే బెల్లంకొండ ధ్యేయం. ప్రస్తుతం అదే మిషన్ ను కొనసాగిస్తున్నాడు కూడా. ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న ఏ హీరో అయినా 50 కథలు వినగలడా..? అది సాధ్యమేనా..? బెల్లంకొండ మాత్రం తను 50 స్టోరీలు విన్నానంటున్నాడు.
“చాలా స్క్రిప్టులు విన్నాను. చాలా అంటే 50కి పైగా కథలు విని ఉంటాను. అది కూడా మా ఫాదర్ ఫిల్టర్ చేసి పంపించిన కథలు.” అలా విన్న 50 కథల్లోంచి కవచం అనే సినిమాను సెలక్ట్ చేసుకున్నానని గొప్పగా చెబుతున్నాడు హీరో బెల్లంకొండ. సాక్ష్యం తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోని ఈ హీరో 50 కథలు ఎలా విన్నాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దాదాపు 6 నెలలు గ్యాప్ తీసుకున్న హీరోలు కూడా 50 కథలు వినలేరు.
కంటెంట్ ఉన్న కథ కోసం ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నానని, కవచం సినిమాలో అలాంటి కంటెంట్ కనిపించిందని, అందుకే 49 కథల్ని పక్కనపెట్టి, కవచానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెబుతున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. అంటే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కంటెంట్ లేకుండానే నటించాడా?
తమ సినిమాల్ని పొగిడే క్రమంలో ఇలాంటివెన్నో చెబుతుంటారు హీరోలు. అందులో భాగంగానే ఈ “50 స్టోరీలు” ఎపిసోడ్ ను తీసుకోవాలేమో. కవచం సినిమా వచ్చేనెలలో థియేటర్లలోకి రాబోతోంది.
కవచం టీజర్ లాంచ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి
టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్