Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరో ఇంటి కోసం కోటిన్నర

హీరో ఇంటి కోసం కోటిన్నర

సినిమాలో సెట్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయడం మామూలే. ఈ విషయంలో హారిక హాసిని, సితార లు ఓ అడుగు ముందు వుంటాయి. అలవైకుంఠపురములో పాటల కోసం భారీ సెట్ లు వేసారు. ఇప్పుడు నిర్మిస్తున్న రంగ్ దే సినిమా కోసం కూడా కోటిన్నరతో ఒక ఇంటి సెట్ నిర్మించారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, సినిమా కథ ప్రకారం ఈ ఇల్లు అమెరికాలో వుంటుంది. 

అంటే అమెరికాలో ఇల్లు అన్నట్లుగా ఈ సెట్ ను చూపిస్తారన్నమాట. యూనిట్ వర్గాల బోగట్టా ప్రకారం సినిమా చూసిన వాళ్లకి ఇది సెట్ అని ఏమాత్రం అనుమానం రాదట. అమెరికా లో ఇల్లు అన్న రేంజ్ లో వుండేలా ఆ సెట్ ను రూపొందించడానికి దగ్గర దగ్గర కోటిన్నర ఖర్చయిందట. 

హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ ల మీద సినిమాలో దాదాపు సగం సీన్లు ఈ ఇంట్లో వుంటాయని తెలుస్తోంది. సినిమా అవుటర్ లుక్ అమెరికాలో చిత్రీకరిస్తారు. ఈ భారీ ఇంటి సెట్ కు అనుగుణంగా సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ లైటింగ్ స్కీమ్ ను సెట్ చేసారట.

ప్రస్తుతం వారం రోజులు టాకీ వర్క్ హైటెక్ సిటీ ప్రాంతంలో పూర్తి చేసుకుని, ఆపై ఇటలీ వెళ్లి రెండు పాటలు చిత్రీకరణ కు రెడీ అవుతోంది రంగ్ దే. ఈ సినిమా సంక్రాంతి ఓటిటిలో విడుదల అవుతుంది. అందుకే చాన్స్ లు ఎక్కువ వున్నాయి.

పవన్, బాబు ఒకరికి ఒకరు

అందరూ కలిసి బైటకి పంపేశారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?