Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరో నాని షాక్?

హీరో నాని షాక్?

శివనిర్వాణ డైరక్షన్ లో తను చేసి టక్ జగదీష్ సినిమా మీద లవ్ స్టోరీ సినిమా డేట్ వేసారని తెలిసి హీరో నాని షాక్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసలు నాని వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు దిల్ రాజు బ్యానర్ లో నాని మాత్రమే మూడు సినిమాలు చేసారు. ఎఫ్ 3 పూర్తయితే వెంకటేష్ కూడా మూడు సినిమాలు చేసినట్లు అవుతుంది. నాని చేసిన మూడు సినిమాలు కూడా దిల్ రాజుకు బాగా డబ్బులు తెచ్చిపెట్టాయి. ఫెయిల్ అయిన 'వి' సినిమా కూడా కరోనా పుణ్యమా అని ఓటిటికి వెళ్లి పది కోట్ల లాభం తెచ్చిపెట్టింది.

అలాంటి నేపథ్యంలో తన సినిమా మీద ఇలా సినిమా వేయడం ఏమిటి?  అని హీరో నాని ఫీలయినట్లు తెలుస్తోంది. మరోపక్క నాగ్ చైతన్య కూడా ఇదే పరిస్థితిలో చిక్కుకున్నారు. 

ఆయనకు మాంచి హిట్ ఇచ్చిన డైరక్టర్ శివనిర్వాణ, హిట్ ఇచ్చిన బ్యానర్ లో తయారైన టక్ జగదీష్ కు పోటీగా తన సినిమా వేయడం ఏమిటి? అని చైతన్య కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. టక్ జగదీష్ ఆ డేట్ కు రాదని చెప్పడం వల్లే చైతన్య ఊ అన్నట్లు తెలుస్తోంది. 

మొత్తానికి ఏప్రిల్ 16 డేట్ టాలీవుడ్ లో కాస్త కలకలం సృష్టించేలాగే వుంది. సినిమా ఇండస్ట్రీలో వ్యాపారం, రాజకీయాలే తప్ప, స్నేహాలు, బంధాలు వుండవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?