Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోను నిలదీసిన రచయిత?

హీరోను నిలదీసిన రచయిత?

టాలీవుడ్ లో హీరో అంటే హీరోనే. ఎదురు ప్రశ్నిస్తే కాస్త కష్టమే. ఓ రైటర్ ఇలాగే ఎదురు ప్రశ్నించి ఏకంగా ప్రాజెక్టునే లేకుండా చేసుకున్నట్లు తెలుస్తోంది. 

చిన్న హీరో ప్రారంభించి మీడియం హీరోతో కలిపి రెండు హిట్ లు కొట్టిన డైరక్టర్ ఒకరు ఓ సీనియర్ హీరోతో సినిమా ప్లాన్ చేసారు. ఈ డైరక్టర్ కు జిగ్రీ దోస్త్, అన్ని రకాల అసిస్టెంట్ గా ఓ రైటర్ వున్నారు. ఈయన లేనిదే ఆయన లేరు. 

తీరాచేసి సినిమా ప్లానింగ్ ఓ కొలిక్కి వచ్చేసరికి హీరో కొన్ని మార్పులు చేర్పులు చెప్పినట్లు బోగట్టా. దానికి ఆ రైటర్ పుసుక్కున మీరు మీ అన్ని సినిమాలకు ఇలా మార్పులుచేర్పులు చెప్పారా? అనే మీనింగ్ వచ్చాలా ఓ క్వశ్చను వేసాడట. అంతే ఇంకేం వుంది. ఖేల్ ఖతమ్.దుకాణ్ బంద్.

ఆ సినిమాను పక్కన పెట్టి మరో సినిమాకు ఓకె చెప్పేసారు ఆ సీనియర్ హీరో. ఆఫ్ కోర్స్ కరోనా కారణంగా అది కూడా ప్రస్తుతానికి ఆగింది అనుకోండి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?