Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్ సీన్లు పెంచిన డైరక్టర్?

హీరోయిన్ సీన్లు పెంచిన డైరక్టర్?

హీరో పని నచ్చితే ఓకె లేదంటే కుక్కగానో, నక్కగానో మార్చేసి సినిమా కానిచ్చేసేవారట అలనాటి డైరక్టర్ విఠలాచార్య. ఇలా అని ఇండస్ట్రీలో చెప్పుకునేవారు. డైరక్టర్లకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. ఎలివేట్ చేస్తారు. 

మంచి సీన్లు మరిన్ని తయారుచేసి పేరు వచ్చేలే చేసే అవకాశం వుంటుంది. లేదూ నచ్చలేదూ అంటే వున్న సీన్లు కూడా తగ్గించి, ఏదో అయిందనిపిస్తారు. అందరూ కాకున్నా కొందరి విషయంలో ఇది జరుగుతుంటుందని టాలీవుడ్ లో వినిపిస్తుంటుంది.

లేటెస్ట్ గా షూట్ లో వున్న ఓ పెద్ద సినిమా డైరక్టర్ కు ఆ సినిమాలో హీరోయిన్ పని తీరు బాగా నచ్చేసిందట. అందుకే ముందు అనుకున్న స్క్రిప్ట్ లో మరిన్ని సీన్లు యాడ్ చేసి, ఆ హీరోయిన్ కు ఎలాగైనా ఎలివేషన్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

హీరో కోసం స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందట. పనిలో పనిగా హీరోయిన్ కోసం కొన్ని సీన్లు జోడించి, ఆమె ముచ్చట తీరుస్తున్నట్లు బోగట్టా. తనకు నచ్చిన వారందరికీ సినిమాలో ఎక్కడో అక్కడ నిల్చోపెట్టి, తెరమీదకు తీసుకురావడం ఆ డైరక్టర్ కు అలవాటు అని గుసగుసలు వున్నాయి. 

అలాగే ఇప్పుడు సరైన చాన్స్ లు, విజయాలు లేని ఆ హీరోయిన్ అదృష్టం తిరిగి ఈ డైరక్టర్ చేతిలోకి వచ్చిందని, మంచి సీన్లు పడితే కెరీర్ టర్నింగ్ ఇచ్చుకుంటుందేమో అని కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కుట్ర

రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద చంద్రబాబు హైడ్రామా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?