Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్లు దొరక్కా.. బడ్జెట్ సమస్య?

హీరోయిన్లు దొరక్కా.. బడ్జెట్ సమస్య?

బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ సినిమా. సమంత.. తమన్నా. రెండో సినిమా తమన్నా స్పెషల్ సాంగ్. మూడో సినిమా రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞ్యా జైశ్వాల్, కేథరిన్,  నాలుగో సినిమా పూజాహెగ్డే. ఇదీ గ్రాఫ్. కానీ వరుసగా భారీ సినిమాలు అన్నీ బకెట్ తన్నేస్తుండడంతో, ఖర్చు తగ్గుంచుకుంటున్నారు అదే సమయంలో పెద్ద డైరక్టర్లు అయితే బడ్జెట్ పెరిగిపోతుందని కొత్త డైరక్టర్లు, మీడియం డైరక్టర్లను ఎంచుకుంటున్నారు. ఆఖరికి ఇప్పుడు హీరోయిన్ల దగ్గర కూడా తేడా కనిపిస్తోంది.

దాదాపు అందరు తెలుగు హీరోల పక్కన నటించేసిన సీనియర్ హీరోయిన్ కాజల్ ను రెండు సినిమాలకు బెల్లంకొండ పక్కన బుక్ చేయడం విశేషం. చిరంజీవి, పవన్ లాంటి ఏజ్డ్ సీనియర్లు యంగ్ హీరోయిన్లు సెట్ కాక కాజల్ తో చేసారు. అలాంటి కాజల్ ను యంగ్ హీరో బెల్లంకొండ సెలెక్ట్ చేసుకోవడం అంటే కాస్త అనుమానమే.

సరే, అనుకుంటే ఇప్పుడు కొత్తగా మెహరిన్ ను ఎంచుకున్నారు. మెహరీన్ కూడా పెద్దగా మార్కెట్ వున్న హీరోయిన్ కాదు. చేతిలో రెండు సినిమాలు వున్నాయి. గ్లామర్ డాల్ లా వుండడమే తప్ప, ఎక్స్ ప్రెషన్లు పలకవు అని క్రిటిసిజమ్ వుంది. మరి ఆమెను తెచ్చుకున్నారు లేటెస్ట్ గా.

ఇదంతా చూస్తుంటే బెల్లంకొండ కాస్ట్ కటింగ్ వార్తలు నిజమనే నిర్థారణ అవుతున్నాయి. మరి ఇక రాను రాను మిగిలిన యంగ్ హీరోల మాదిరిగా 15కోట్ల రేంజ్ సినిమాలే చేస్తారేమో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?