Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హైదరాబాద్ దాటేది లేదు-పవన్?

హైదరాబాద్ దాటేది లేదు-పవన్?

రాజకీయాలు కాస్త పక్కన పెట్టి, చకచకా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీమేక్ వకీల్ సాబ్, క్రిష్ తో ఒకటి, హరీష్ శంకర్ తో మరొకటి ఒప్పేసుకున్నారు. కానీ ఆ ఆశలు అన్నీ చెదరిపోతున్నాయి ఇఫ్పుడు. కరోనా కారణంగా అసలు ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో?  ఏ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఇలాంటి నేపథ్యంలో క్రిష్ డైరక్షన్ లో పీరియాడిక్ సినిమా పరిస్థితి డోలాయమానంగా వుంది అని తెలుస్తోంది. ఈ సినిమా లో పవన్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఒకడు మంచి వాడు మరొకరు దొంగ. రాబిన్ హుడ్ టైపు స్టోరీ. సో మామూలుగా అయితే గ్రాఫిక్స్ పనులు ఎక్కువ వుంటాయి క్రిష్ ఈ గ్రాఫిక్స్ కాకుండా వీలయింత తక్కువలో తీసేందుకు వీలుగా కొన్ని లోకేషన్లు సెట్ చేసుకుని వుంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో శాతకర్ణి సినిమాకు ఇలాగే చేసారు. 

అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో మొత్తం వ్యవహారం తల్లకిందులైంది. తాను హైదరాబాద్ దాటి వచ్చేది లేదని, అవుట్ డోర్ ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అలా అయితే ప్లాన్ లు మొత్తం మారిపోతాయి. టెక్నికల్ వర్క్, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ మారిపోతాయి. లేదూ అంటే ముందుగా హరీష్ శంకర్ సినిమా పూర్తి చేసి, తరువాత క్రిష్ సినిమా చేయాలనే ఆలోచనను కూడా పవన్ బయట పెట్టారని టాక్ వినిపిస్తోంది. 

అందుకే క్రిష్ కిందా మీదా పడుతున్నట్లు బోగట్టా. అసలే టాప్ లైన్ డైరక్టర్ల ఆర్డర్ లో వుండే క్రిష్ మహానాయకుడు సినిమా తరువాత వెనక్కు జారిపోయారు. త్రివిక్రమ్, కొరటాల, సుకుమార్ లు మాత్రమే టాప్ లైన్ లో వున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా కనుక కాస్త అటు ఇటు అయితే క్రిష్ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. మరే హీరో ఇప్పుడు రెడీగా లేరు. 

మొత్తానికి 2021లో కూడా క్రిష్-పవన్ సినిమా వస్తుందా? అన్నది అనుమానంగానే వుంది.

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?