ఇబ్బందుల్లో ‘రాథేశ్వామ్’ షూట్

బాహుబలి ప్రభాస్ రాథేశ్వామ్ షూటింగ్ ఇబ్బందుల్లో పడింది. గత పది రోజులుగా ఈ సినిమా షూట్ ఇటలీ తదితర ప్రాంతాల్లో జరుగుతోంది కోవిడ్ నిబంధనలకు లోబడి, పలు ఇబ్బందులు ఎదుర్కుంటూనే చేసుకుంటూ వస్తున్నారు.. అయితే…

బాహుబలి ప్రభాస్ రాథేశ్వామ్ షూటింగ్ ఇబ్బందుల్లో పడింది. గత పది రోజులుగా ఈ సినిమా షూట్ ఇటలీ తదితర ప్రాంతాల్లో జరుగుతోంది కోవిడ్ నిబంధనలకు లోబడి, పలు ఇబ్బందులు ఎదుర్కుంటూనే చేసుకుంటూ వస్తున్నారు.. అయితే ఇప్పుడు విదేశాల్లో కోవిడ్ మలి దశ ప్రారంభమైంది. కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

దాంతో కోవిడ్ నిబంధనలు మరింత కఠినం చేస్తున్నారు. రోజులో కొన్ని గంటలు కర్ఫ్యూ విధిస్తున్నారు. దీంతో షూటింగ్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారిందని  తెలుస్తోంది. ఎంతవరకు వీలయింతే అంత వరకు షూట్ చేసి వెనక్కు వచ్చేయాలని యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రంగ్ దే పునరాలోచన

వాస్తవానికి రాథేశ్యామ్ తరువాత దాదాపు ఆ ప్రాంతాల్లో లేదా యూరప్ లోని మరి కొన్ని లోకేషన్లలో రంగ్ దే సినిమా షూట్  ప్లాన్ చేసారు. ఆరంభంలో ఈనెలాఖరులో వెళ్లాలనుకున్నారు.

కానీ పరిస్థితి చూసి, నవంబర్ తొలివారికి వాయిదా వేసారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మరీ విషమిస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో రంగ్ దే యూనిట్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

యూరప్ కన్నా దుబాయ్ లాంటి ప్రదేశాల్లో షూట్ చేస్తే ఎలా వుంటుంది? అవకాశాలు ఎలా వున్నాయి?అన్న డిస్కషన్లు సాగుతున్నాయి. నిజానికి రంగ్ దే షూట్ కు కొత్తగా పెళ్లయిన హీరో నితిన్ సతీ సమేతంగా వెళ్లాలని అనుకున్నారు. కానీ కోవిడ్ మలి దశ అన్ని ప్లాన్ లు మార్చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ధైర్యవంతుడినే కానీ, ఫూల్ ని కాదు