Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఐకాన్ మీటింగ్స్ మొదలు

ఐకాన్ మీటింగ్స్ మొదలు

హీరో అల్లు అర్జున్ కు నచ్చినా కూడా ఎందుకో లైన్ లో వెనక్కు పెట్టిన ప్రాజెక్ట్ ఐకాన్. కొన్నాళ్ల పాటు ఐకాన్ అనే లోగో వున్న క్యాప్ పెట్టుకుని కనిపించాడు బన్నీ.

ఈ మధ్య పుష్ప టీజర్ లొ కూడా స్టయిలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. వకీల్ సాబ్ విడుదలకు ముందు నుంచే దిల్ రాజకు సినిమా చేస్తారని, చాలా వరకు అది ఐకాన్ నే అవుతుందని వార్తలు కూడా వినిపించాయి.

ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో పుష్ప సినిమా డిసెంబర్ వరకు రాదని క్లారిటీ రావడం, ఎన్టీఆర్ కోసం కొరటాల శివ స్ట్రిప్ట్ రెడీ చేయడంతో ఆయనను అటు పంపించాల్సి వచ్చింది. ఇది బన్నీ-ఎన్టీఆర్ ల మ్యూచువల్ అడ్జస్ట్ మెంట్. కొరటాల శివ మళ్లీ వెనక్కు రావడానికి కనీస్ ఏడాది పడుతుంది.

ఈలోగా బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా వుంది ఐకాన్. వకీల్ సాబ్ హిట్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు-బన్నీ-వేణు శ్రీరామ్ ల కాంబినేషన్ మళ్లీ షురూ అయింది. 

వకీల్ సాబ్ సక్సెస్ హడావుడి అలా వుండగానే అప్పుడే ఒకటి రెండు డిస్కషన్ మీటింగ్ లు షురూ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఫస్ట్ టైమ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వేణు శ్రీరామ్ సినిమా స్టార్ట్ కాబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?