cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఇది గోపీచంద్-'విశ్వరూపం'

ఇది గోపీచంద్-'విశ్వరూపం'

హీరో గోపీచంద్ లేటెస్ట్ సినిమా చాణక్య. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు తిరు దర్శకుడు. టెర్రరిజం నేపథ్యంలో అల్లుకున్న కథలో అండర్ కవర్ ఏజెంట్ గా గోపీచంద్ నటిస్తున్నట్లు కనిపిస్తోంది. రా ఏజెంట్ అర్జున్ గా, అండర్ కవర్ ఆపరేటివ్ ఏజెంట్ గా గోపీచంద్ నటించినట్లు విడుదల చేసిన టీజర్ వెల్లడిస్తోంది.

టీజర్ లో వున్న సబ్జెక్ట్ కానీ, పాయింట్ కానీ, సీన్లు కానీ పెద్దగా కొత్తగా లేకపోవడం చిత్రం. ఎందుకంటే ఈ టైపు సినిమాలు ఇంతకుముందే వచ్చాయి. ముఖ్యంగా కమల్ హాసన్ విశ్వరూపం సిరీస్ చూసిన తరువాత ఎవరు ట్రయ్ చేసినా ఆనడం అన్నది కాస్త కష్టం.

టీజర్ లోని షాట్స్ లో కానీ, డైలాగ్ పంచ్ లో కానీ, యాక్షన్ సీక్వీన్స్ ల్లో కానీ స్పీడ్ లేదా జోష్ కొరవడినట్లు కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలకు యాక్షన్ స్వీక్సెన్స్ నే ప్రాణం. గోపీచంద్ అలాగే సినిమాటోగ్రఫీ. కానీ టీజర్ వరకు ఈ రెండూ అంత అప్ టు ది మార్క్ వున్నట్లు లేదు. టీజర్ కట్ సరిగ్గా లేక ఇలా వుందేమో? ఫుల్ లెంగ్త్ సినిమా వస్తే బాగుండే అవకాశం వుంటుందేమో? చూడాలి.