Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇది రవితేజ 'రాక్షసుడు'

ఇది రవితేజ 'రాక్షసుడు'

రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడీ టీజర్ బయటకు వచ్చింది. మే నెలాఖరులో విడుదల చేయాలన్నది సంకల్పం. కానీ సినిమా వర్క్ చాలా వుండడం, కరోనా వ్యవహారాలు అన్నీ కలిసి ఆ విషయం పక్కన పెట్టాయి.

అయితే విడుదలయిన టీజర్ చూస్తుంటే రవితేజ తో దర్శకుడు రమేష్ వర్మ మళ్లీ రాక్షసుడు లాంటి సినిమా ట్రయ్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది. రవితేజ హీరో కనుక చిత్రీకరణ భారీ రేంజ్ లో వుంది.

సినిమాలో రవితేజ రెండు షేడ్స్ లోనో, రెండు క్యారెక్టర్లలోనో కనిపిస్తాడనే టాక్ వుంది.టీజర్ లో కూడా ఆ ఛాయలు కొంచెం కనిపించాయి. అయితే మరీ హీరో క్యారెక్టర్ కూడా సుత్తి పట్టుకుని తలపై మోదే సీన్ చూస్తే, థ్రిల్లర్ కు ఎక్కువ, హర్రర్ థ్రిల్లర్ కు తక్కువ అన్నట్లు వుంది.

దర్శకుడు రమేష్ వర్మ ఆ మధ్యనే రాక్షసుడు అనే రీమేక్ అందించి హిట్ కొట్టారు. ఆ ఊపులోనే మళ్లీ అలాంటి ఛాయలు వున్న భారీ సినిమాను రవితేజ తో తలకెత్తుకున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇక్కడ విలన్ లేడు. హీరోనే విలన్ లా చూపించారు కాబట్టి, ఇదో తరహా రివెంజ్ డ్రామా యేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?