cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇదిగో పవన్..అదిగో సినిమా

ఇదిగో పవన్..అదిగో సినిమా

ఆలు లేదు చూలు లేదు అన్నట్లుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మైత్రీ మూవీస్ సినిమా. ప్రస్తుతం చేసున్న వకీల్ సాబ్ పూర్తి కాలేదు. జూన్ లో మొదలు పెట్టినా జూన్ నెలాఖరు వరకు వుండే అవకాశం వుంది. ఆ తరువాత క్రిష్ డైరక్షన్ లో సినిమా వుంది. అది కాస్త ఎక్కువ వర్కింగ్ డేస్ వున్న సినిమా. పైగా గ్రాఫిక్స్ ఇతరత్రా వ్యవహారాలు వున్నాయి. అందువల్ల ఈ సినిమా 2021 మార్చి తరువాత కానీ పూర్తి కాదు. అదీ అప్పటికీ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తేనే.

ఆ తరువాత మైత్రీ మూవీస్ సినిమా సంగతి. ఈ లోగా పొలిటికల్ వ్యవహారాలు వుంటాయి. పవన్ తో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కప్ టు లిప్ అన్నట్లు మధ్యన ఏదైనా జరగొచ్చు. కానీ గబ్బర్ సింగ్ ఆన్ వర్సరీ హడావుడిలో ఈ మైత్రీ మూవీస్ సినిమా సందడి మొదలయింది. అదిగో దేవీ పాటలు చేస్తున్నారు అని బయటకు వచ్చింది.

దాంతో మిగిలిన గ్యాసిప్ లు కూడా మొదలయ్యాయి. హీరోయిన్ ఫలానా అంటూ ట్విట్టర్ లో సందడి. దాన్ని బట్టకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా రాసేయడం. పోనీ ఏదో రాసుకున్నారులే, పాజిటివ్ గ్యాసిప్ నే కదా అని ఊరుకోకుండా ఖండించేయడం. ఇలా మహా రంజుగా సాగుతోంది వ్యవహారం. చిత్రమేమింటే మరోపక్కన ఈ సినిమా ఓ పరభాషా సినిమాను ఫ్రీమేక్ అన్న గ్యాసిప్ లు వున్నాయి. ఆ ఒరిజినల్ సినిమా హక్కులు ఓ తెలుగు నిర్మాత దగ్గర వున్నాయని, పైకి చెప్పకుండా, హక్కులు తీసుకునే చర్చలు సాగుతున్నాయని గ్యాసిప్ లు వున్నాయి. కానీ ఇవన్నీ ఎవరైనా రాసినా, మళ్లీ ఖండిస్తారు అది మామూలే. ఇలా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, మస్తు గ్యాసిప్ లకు మూలంగా వుంది. పవన్ - మైత్రీ సినిమా.

మే 18 నుంచి కొత్త రూల్స్ తో లాక్ డౌన్