Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇదిగో త్రివిక్రమ్-అదిగో మహేష్

ఇదిగో త్రివిక్రమ్-అదిగో మహేష్

వార్తలు దొరకాలి లేదా పుట్టించాలి. ఇదే ఇప్పటి మీడియా తీరు. అలా పుట్టిన వార్తనే హీరో మహేష్ బాబును డైరక్టర్ త్రివిక్రమ్కలిసారు..త్వరలో సినిమా చేసేస్తున్నారు అంటూ పుట్టుకు వస్తున్న వార్తలు. ఈ వార్తల వెనుక నిజం కాస్త ఆలోచిస్తే...

కరోనా కు ముందు మహేష్ బాబు తరపున నమ్రత నుంచి త్రివిక్రమ్ కు ఫోన్ లు వచ్చాయన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఆర్ఆర్ఆర్ లేటు అవుతుంది కనుక మహేష్ తో ఓ సినిమా చేద్దామని ఆమె ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ దానికి త్రివిక్రమ్ సానుకూలంగా స్పందించలేదు. దాంతో విసిగిపోయిన మహేష్ క్యాంప్ అర్జెంట్ గా సర్కారు వారి పాట సినిమా ఫైనల్ చేసింది. 

పరుశురామ్ ను బలవంతంగా నాగ్ చైతన్య సినిమా నుంచి ఇటు లాక్కు వచ్చారు  అలాంటిది ఇప్పుడు పరుశురామ్ ను పక్కన పెట్టి త్రివిక్రమ్ తో సినిమానా? నమ్మే మాటేనా?  పైగా ఈ నెల 15న పరుశురామ్ బయల్దేరి అమెరికాకు రెక్కీకి వెళ్తున్నారు. నవంబర్ నుంచి 40 రోజుల సింగిల్ షెడ్యూలు. అంటే జనవరి నాటికి కానీ అమెరికా నుంచి రారు. త్రివిక్రమ్ తో సినిమా చేసేయాలి అనుకున్నా ఫిబ్రవరి కి కానీ వీలు కాదు.

మరి ఫిబ్రవరి దాకా వెయిట్ చేసి, మరో రెండు నెలలు త్రివిక్రమ్ వెయిట్ చేయలేరా ఎన్టీఆర్ కోసం? నిజంగా మహేష్ బాబుతో సినిమా చేసుకువస్తాం అని ఎన్టీఆర్ కు చెప్పేంత సీన్ వుంటుందా? అలా చెప్పి మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వుంటుందా?  విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం త్రివిక్రమ్, ఆయన బ్యానర్ హారిక హాసిన ఇంట్రస్ట్ అంతా ఎన్టీఆర్ మీద తరువాత రామ్ చరణ్ మీద. అంతే తప్ప మహేష్ బాబు మీద ప్రస్తుతానికి అయితే లేదని తెలుస్తోంది. 

ఇప్పుడు ఇలాంటి వార్తలు పుట్టుకురావడం వల్ల హారిక హాసిని టెన్షన్ పడుతున్నట్లు బోగట్టా. ఎక్కడ ఎన్టీఆర్ ఇవన్నీ చూసి, ఏం జరుగుతోందో అన్న ఆలోచనకు వస్తే, అనవసరంగా లేనిపోని తలకాయనొప్పులు వస్తాయన్నది ఈ టెన్షన్ కు కారణంగా తెలుస్తోంది. మరోపక్క ఇలాంటి వార్తలు పుట్టుకురావడం వెనుక మహేష్ బాబు క్యాంప్ స్ట్రాటజీ వుందేమో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమా ఎలాగూ ఆలస్యం అవుతుంది కనుక, ఇలాంటి వార్తలు పుట్టించి, వీలయినంత అయోమయ పరిస్థితి పుట్టిస్తే, ఆ సినిమా ఏమన్నా అటు ఇటు అయి త్రివిక్రమ్ ఇటు వస్తారనా?

కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, ఎన్టీఆర్-త్రివిక్రమ్, రామ్ చరణ్-త్రివిక్రమ్...మహా అయితే విక్టర్ వెంకటేష్-త్రివిక్రమ్ ఈ సినిమాలు తప్ప మరేదీ ప్రస్తుతానికి ఆలోచనలో లేవని తెలుస్తోంది. 

హిందుత్వం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?