Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆంటీగా టబు.. కుర్రాడితో ప్రేమ, బోల్డ్ సీరియల్!

ఆంటీగా టబు.. కుర్రాడితో ప్రేమ, బోల్డ్ సీరియల్!

ఇది వరకూ తన సినిమాలతో పలు సంచలనాలకు తెరలేపిన దర్శకురాలు మీరా నాయర్. 'సలామ్ బాంబే'తో అవార్డులు, రివార్డులు పొందిన ఈ దర్శకురాలు.. ఆ తర్వాత పలు బోల్డ్ కాన్సెప్ట్ లపై సినిమాలు రూపొందించారు. 'కామసూత్ర' ను తెరకెక్కించిన ఈ మహిళా దర్శకురాలు వైవిధ్యభరితమైన సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు.

ఇలాంటి క్రమంలో బీబీసీ వాళ్ల కోసం మీరా నాయర్ ఒక టీవీ సీరిస్ ను రెడీ చేస్తోంది. 'ఏ సూటబుల్  బాయ్' పేరుతో ఇది తెరకెక్కుతూ ఉంది. ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. ఇందులో టబు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఇషాన్ ఖట్టర్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నాడు.

ఇది ఈ కాలం కథ కాదని తెలుస్తోంది. ఒక వరండాలో నాలుగు కుటుంబాలు నివసించిన కాలాలకు సంబంధించిన కథ అని, ఆ సమయంలో తన కన్నా వయసులో పెద్దదైన మహిళతో కుర్రాడి ప్రేమకు సంబంధించిన కథాంశమని తెలుస్తోంది. విక్రమ్ సేథ్ అదే పేరుతో రాసిన కథ ఆధారంగా ఈ టీవీ సీరిస్ రూపొందుతూ ఉంది.

ఇది వరకూ కూడా అంటీ-అబ్బాయి కథలు బోలెడన్ని వచ్చాయి. మలయాళీ సినిమా 'రతీ నిర్వేదం' సంచలనం రేపింది. మరి సంచలనాలకు కేరాఫ్ అయిన టబు-మీరా నాయర్ కాంబో ఈ సారి ఎలాంటి సంచలనం రేపుతుందో కానీ, ఈ ఫస్ట్ లుక్ ను బాలీవుడ్ ప్రముఖులంతా ప్రశంసిస్తున్నారు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?