Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇటు చిన్న హీరో...అటు రవితేజ?

ఇటు చిన్న హీరో...అటు రవితేజ?

పూరి జగన్నాధ్ ది ఒక విలక్షణ శైలి. గురువు ఆర్జీవీ స్టయిల్ మాదిరిగానే వుంటుంది కానీ, రేంజ్ దగ్గర రాజీపడడు. చిన్న సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా, దానికి ఓ చిన్నదో పెద్దదో క్రేజ్ వచ్చేలా, వుండేలా చూసుకుంటాడు. ఆ మధ్య వున్నట్లుంది జ్యోతిలక్ష్మి లాంటి చిన్న సినిమా తీసాడు. 

అంతే కాదు, ఆ సినిమా ప్రచారం సందర్భంగా మీడియా జనాలకు లిక్కర్ బాటిళ్లు ఇచ్చి ఆశ్చర్య పరిచాడు. అదో స్టయిల్..అదే పూరి స్టయిల్. సరే, ఆ సినిమా రేంజ్ మేరకు ఆ సినిమా ఆడింది అనుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ పూరి ఖాళీనే. రోగ్ సినిమా పూర్త అయినట్లు కానట్లు వుంది. మహేష్ తో ఇప్పట్లో సినిమా వుండే అవకాశమే లేదు. ఎన్టీఆర్ వ్యవహారం కూడా దాదాపు అలాగే కనిపిస్తోంది. 

అందుకే పూరి మరోసారి చిన్న సినిమా వైపు దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. నాగశౌర్య కానీ, లేదా మరో యంగ్ హీరో తో కానీ మీడియం బడ్జెట్ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఈ సినిమాకు పూరి సమర్పకుడిగా, ఆయన మిత్రులు కొందరు నిర్మాతలుగా వ్యవహరిస్తారని టాక్. ఆ తరువాత రవితేజతో ఓ సినిమా చేయాలనే ప్రయత్నంలో కూడా పూరి వున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?