ఇవి దిల్ రాజు పైపై మాటలు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అన్నది ఎనాటి నుంచో కోరిక నిర్మాత దిల్ రాజుకు. ఆ కోరిక నెరవేరింది వకీల్ సాబ్ సినిమాతో. కానీ ఆ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అన్నది ఎనాటి నుంచో కోరిక నిర్మాత దిల్ రాజుకు. ఆ కోరిక నెరవేరింది వకీల్ సాబ్ సినిమాతో. కానీ ఆ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి అంత స్మూత్ గా మాత్రం నడవడం లేదు.

పవన్ కళ్యాణ్ కు భారీ రెమ్యూనిరేషన్ పెట్టి, మిగిలిన పాత్రల కోసం చొటా మోటా జనాలను తీసుకుని బాగానే ఆదా చేసారు. కానీ కరోనా వచ్చి సినిమాకు బ్రేక్ పడింది. కరోనా తగ్గింది అనుకున్నా షూటింగ్ ఏమంత స్పీడ్ గా జరగడం లేదు.

డిసెంబర్ నెలాఖరుకు సినిమా పూర్తవుతుంది కానీ విడుదల ఎప్పుడు అన్నది క్లారిటీ లేకుండా అయిపోయింది. సంక్రాంతికి విజయ్ మాస్టర్ తో సహా పలు సినిమాలు వున్నాయి. అందువల్ల ఏప్రియల్ వరకు వకీల్ సాబ్ కు డేట్ లేదు. 

అటు వకీల్ సాబ్ లో బోనీ కపూర్ కు వాటా, ఇటు సినిమా నిర్మాణం, వడ్డీలు కలిపి దాదాపు 80 కోట్లకు పైగా ఖర్చు, సినిమావిడుదలకు డేట్ లేకపోవడం, అన్నింటికి మించి థియేటర్ల పరిస్థితి, జనం ఎలారిసీవ్ చేసుకుంటారో అన్న అనుమానం ఇవన్నీ కలిసి దిల్ రాజు కు కాస్త అసంతృప్తిని కలుగచేస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

లోపల ఎలావుందో ఏమో కానీ బయటకు మాత్రం ఈ ప్రాజెక్టు పెద్దగా వెయబుల్ కాదని అంటున్నారని టాక్. మార్నింగ్ వాక్ లో కలిసిన సినిమా జనాలు వకీల్ సాబ్ గురించి ప్రస్తావిస్తే, అసంతృప్తిగా మాట్లాడుతూ, కావాలంటే ఇప్పటి వరకు తాను ఖర్చు చేసిన దానిపై ఓ పదికోట్లు ఇస్తే ప్రాజెక్టు ఇచ్చేస్తానని గమ్మత్తుగా అంటున్నట్లు తెలుస్తోంది. ఎమిటో దీని వెనుక దిల్ రాజు స్ట్రాటజీ?

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను