Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జగన్ ను రాంగ్ సైడ్ రబ్ చేసారు

జగన్ ను రాంగ్ సైడ్ రబ్ చేసారు

వకీల్ సాబ్ లో నివేదా చేత దెబ్బతిన్న విలన్ సైలంట్ గానే వుంటాడు. కానీ ఆ పక్కన వున్న ఫ్రెండ్ నే వ్యవహారాన్ని చింపి చేటంత చేస్తాడు. వకీల్ సాబ్ టికెట్ లు, స్పెషల్ షోల విషయంలో ఇలాగే జరిగింది. ఎన్నాళ్లుగానో టికెట్ ల రేటు పెంపు అన్నది సజావుగా సాగిపోతోంది. 

ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వదిలేస్తూ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎప్పటిలాగే టికెట్ రేట్లు తెచ్చుకున్నారు. కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే సమస్య వచ్చింది. దాన్ని అక్కడితో వదిలేసి వుంటే సరిపోయేది. 

ఏకంగా ఈస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ నే కోర్టుకు లాగారు. ఆ మధ్య రిటైర్ అయిన నిమ్మగడ్డ లాంటి వ్యక్తి అయితే ఆ జాయింట్ కలెక్టర్ ఈస్ట్ లో థియేటర్లతో ఓ ఆట ఆడేసుకుంటారు. ఎందుకంటే మన థియేటర్లు నిబంధనలు ఎంత బాగా పాటిస్తాయో మనకు తెలిసిందే.  

జేసి ని కోర్టుకు లాగిన డిస్ట్రిబ్యూటర్ బాగానే వుంటారు. ముందు థియేటర్ల యజమానులు ఇరుకున పడతారు. ఆ సంగతి అలా వుంచితే టికెట్ రేట్లు వ్యవహారం అంతా రాజకీయానికి వాడేయడం ప్రారంభించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ తదితర సినిమా జనాలు సైలెంట్ గానే వున్నారు. కానీ పొలిటికల్ జనాలు దీన్ని మరింత పొలిటికల్ చేసేసారు. దాంతో ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా తీసుకుంది.

అలాగే అదనపు ఆటలు అన్నవి మాండేటరీ కాదు. ఏదో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇస్తున్నారు. ఈసారి ఇవ్వలేదు. కామ్ గా వుంటే పోయేది. కానీ దాన్నీ రాజకీయం చేసేసారు. దానికి వాడేసారు. రాజకీయపరంగానే అదనపు ఆటలకు అనుమతి ఇవ్వకపోయి వుండొచ్చు. కానీ వీలయినంత సంయమనం పాటిస్తే ఇండస్ట్రీకే మంచింది. 

ఇండస్ట్రీ తరపున ఆ విధమైన ప్రకటన ఇచ్చి వుంటే పోయేది. కానీ అలా జరగలేదు. రాజకీయ నాయకులు పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో అదనపు ఆటలకు అనుమతి ఇవ్వలేదని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు.దీంతో ఆ విషయం కూడా పొలిటికల్ ఇగోల మధ్యకు చేరిపోయింది.

ఇప్పుడు ఏమయింది.అర్జెంట్ గా టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి వుంది. సినిమా జనాలకు జరిగిన రచ్చతో సంబంధం లేదని, ప్రభుత్వం సినిమా రంగం రెండింటి మధ్య సంబంధాలు సరిగ్గానే వున్నాయని చెప్పాల్సి వుంది. లేదూ అంటే భవిష్యత్ లో టాలీవుడ్ కు కష్టమే.ఆంధ్ర-సీడెడ్ కలిసి తెలంగాణ కన్నా ఎక్కువ ఆదాయం అందించే ఏరియాలు.

ఇకపై టికెట్ రేట్ల విషయంలో గట్టిగా వున్నా, అదనపు ఆటలకు అనుమతి ఇవ్వకపోయినా, థియేటర్ ల దగ్గర జరిగే పన్నుల గోల్ మాల్ ను ఓ పట్టు పట్టినా ఇండస్ట్రీ గిలగిలలాడిపోతుంది. చేతుల పూర్తిగా కాలిపోక ముందే చిరు, నాగ్ లాంటి వాళ్లు రంగంలోకి దిగడం అవసరం. ఎందుకంటే అక్కడ వున్నది జగన్..అలియాస్ జగమొండి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?