Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జనసేన నుంచి 'జె' ఛానెల్?

జనసేన నుంచి 'జె' ఛానెల్?

జనసేన పార్టీ కూడా స్వంత ఛానెల్ దిశగా పయనిస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ చానెల్ పెట్టి, విజయం సాధించలేక పోయిన ఓ ఎంటర్ పెన్యూర్స్ సాయంతో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఛానెల్ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

గతంలో ఓ ఛానెల్ ను ఆర్భాటంగా కొందరు స్టార్ట్ చేసారు. దానికి క్యాచీ ప్రింట్ మీడియా పేరు అయితే సెట్ అయింది కానీ, నిర్వహణకు మొహమాటం, రికమెండేషన్ తో తీసుకున్న కీలక బాధ్యుడు మాత్రం ఆ ఛానెల్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు.

కోటు, సూటు ఆర్భాటం తప్ప చానెల్ సక్సెస్ కాలేదు. ఆ తరువాత అది మూత పడింది. ఆ ఎక్విప్ మెంట్, లైసెన్స్ అంతా అలాగే వుందని, వాటిని వాడుకుని, జె ఛానెల్ స్టార్ చేయాలన్నది పవన్ ఆలోచన అని తెలుస్తోంది.

అదే నిజమైతే, త్వరలో మరో పొలిటికల్ చానెల్ ఆవిర్భవిస్తుందని అనుకోవాలి. ఇప్పటికే మీడియాలో అనుభవం వున్న పలువురిని, పవన్ మంచి జీతాలు ఇచ్చి, తన మీడియా వింగ్ లోకి తీసుకున్నారు. ఆ విధంగా ఆయనకు సిబ్బంది కొరత కూడా పెద్దగా వుండకపోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?