కాజల్‌ అగర్వాల్‌కి ‘ఛోటా’ ఝలక్‌

సినిమాటోగ్రాఫర్‌గా ఛోటా కె నాయుడు గురించి కొత్తగా చెప్పేదేముంది.? టాలీవుడ్‌ టాప్‌ సినిమాటోగ్రాఫర్లలో ఆయనా ఒకరు. సినీ వేదికలపై ఒకింత అత్యుత్సాహం చూపడంలో ఆయనకు ఆయనే సాటి. 'ఆటిట్యూడ్‌' విషయంలోనూ మిగతా సినిమాటోగ్రాఫర్లతో పోల్చితే…

సినిమాటోగ్రాఫర్‌గా ఛోటా కె నాయుడు గురించి కొత్తగా చెప్పేదేముంది.? టాలీవుడ్‌ టాప్‌ సినిమాటోగ్రాఫర్లలో ఆయనా ఒకరు. సినీ వేదికలపై ఒకింత అత్యుత్సాహం చూపడంలో ఆయనకు ఆయనే సాటి. 'ఆటిట్యూడ్‌' విషయంలోనూ మిగతా సినిమాటోగ్రాఫర్లతో పోల్చితే రెండాకులు ఎక్కువే చదివేశాడు ఛోటా కె నాయుడు. హీరోయిన్లను పొగిడేయడంలో మనోడు 'మాస్టర్‌ డిగ్రీ' చేశాడని టాలీవుడ్‌లో ఓ గట్టి వాదన వుందనుకోండి.. అది వేరే విషయం. 

అసలు విషయమేంటంటే, 'కవచం' సినిమా టీజర్‌ విడుదల సందర్భంగా, వేదికపై హీరోయిన్‌ కాజల్‌ని ముద్దాడేశాడు ఛోటా కె నాయుడు. ఊహించని ఈ ఘటనతో కాజల్‌ షాక్‌ అయితే, పక్కనే వున్న మెహరీన్‌ కూడా బిత్తరపోయింది. మొత్తంగా ఈ ఈవెంట్‌లో ఛోటా చేసిన ఆ పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. అసలు ఛోటా కె నాయుడికి ఏమయ్యింది.? అని టాలీవుడ్‌లో ఇప్పుడంతా ఈ విషయం గురించే చర్చించుకుంటుండడం గమనార్హం. 

రోజులు బాగా మారిపోయాయ్‌. ఎప్పుడో పదేళ్ళు, పాతికేళ్ళ నాటి సంఘటనల్ని ఫ్రెష్‌గా తెరపైకి తెచ్చి 'మీ..టూ..' అనేస్తున్నారు అందాల భామలు. ఈ పరిస్థితుల్లో పురుష పుంగవులు ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. అందాల భామలు అడ్వాంటేజ్‌ తీసుకుంటున్నా, టెక్నీషియన్స్‌ ఛాన్స్‌ తీసుకోవట్లేదు. అమలా పాల్‌ విషయంలో ఓ యువ దర్శకుడు ఎంతలా జాగ్రత్తపడ్డాడో చూశాం. 'అతను చాలా మంచోడు.. నేను కౌగలించుకుందామనుకున్నా.. ఒప్పుకోలేదు..' అంటూ అమలా పాల్‌ ఆ దర్శకుడి గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజ్జంగానే, ఇప్పుడు సినీ రంగంలో చాలా మంది ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారు. 

మరి, ఛోటా కె నాయుడు అంత 'జాగ్రత్త' ఎందుకు వహించలేదట.? ఏమోగానీ, సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ కావడంతో.. ఊహించని ఘటనే అయినా, కాజల్‌ ఆ 'ముద్దు' విషయాన్ని లైట్‌ తీసుకుంది. నడుమ్మీద చెయ్యేసి.. ఠక్కున ముద్దు పెట్టేసిన ఛోటా కె నాయుడు ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.