లారెన్స్ హర్రర్ సీరీస్.. కాంచన. ఈ సిరీస్ లో భాగంగా రాబోతోంది పార్ట్ 3. ఈ సినిమాను ఒరిజినల్ గా ఏప్రియల్ 18న షెడ్యూలు చేసారు. కానీ ఇప్పుడు ఓవారం ముందుకు జరిపి, 12న రాబోతోంది. తమిళ వెర్షన్ నిర్మాతలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో తెలుగులో కూడా అదే డేట్ కు విడుదల చేయడం తప్పదు.
అయితే సమస్య ఏమిటంటే, ఇప్పటికే ఆ డేట్ ను సాయిధరమ్ తేజ్-మైత్రీ కాంబినేషన్ లోని చిత్రలహరికి ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు అదేరోజు కాంచన 3 వుంటే చిత్రలహరి ఓపెనింగ్స్ కచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. అసలే సాయిధరమ్ తేజ్ టైమ్ బాలేదు. అందువల్ల ఓవారం వెనక్కు వెళ్లక తప్పదు.
పోనీ వెళ్దాం అనుకున్నా, ఆపై వారం మహేష్ బాబు మహర్షి సినిమా విడుదల వుంది. అంటే వారంలో థియేటర్లు చాలావరకు లేచిపోతాయి. కానీ తప్పదు. ఇటు కాంచన 3, అటు మహర్షి, మధ్యలో చిత్రలహరి.