Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరో త‌న‌కు ర‌హ‌స్యంగా ఫోన్ చేశాడ‌న్న హీరోయిన్!

ఆ హీరో త‌న‌కు ర‌హ‌స్యంగా ఫోన్ చేశాడ‌న్న హీరోయిన్!

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ మానసిక ప‌రిస్థితి గురించి నెటిజ‌న్లు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. ఆమె పెట్టే ట్వీట్ల‌పై నెటిజ‌న్లు ఈ త‌ర‌హాలో స్పందిస్తూ ఉన్నారు. త‌న గొప్ప‌లు, త‌ను గొప్ప అని చెప్పుకోవ‌డానికి కంగ‌నా అనుస‌రిస్తున్న మార్గ‌మే చాలా మందికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తూ ఉంది. ఇంత‌కీ ఏమైందీమెకు? అనే ప్ర‌శ్న వ్య‌క్త‌మ‌య్యేలా ఉంటున్నాయి కంగ‌నా స్పంద‌న‌లు. ఇప్ప‌టికే బోలెడ‌న్ని వివాదాలు రాజేసిన కంగ‌నా.. తాజాగా త‌న గొప్ప‌ను చెప్పుకోవ‌డానికి చాలా తిప్ప‌లు ప‌డింది. త‌న న‌టించిన తలైవి సినిమాలో త‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు అందుతున్నాయ‌ని కంగ‌నా చెప్పుకుంది.

ఇలా చెప్పుకోవ‌డంలో వింత ఏమీ లేదు. సినిమా వాళ్లంద‌రి ఊత ప‌దాలే ఇవి. త‌మ న‌ట‌న‌కు, త‌మ శ్ర‌మ‌కు వ‌స్తున్న ప్ర‌శంస‌ల‌తో చాలా ఆనందంగా ఉందంటూ సినిమాటిక్ డైలాగులు చెబుతూ ఉంటారు న‌టీన‌టులంతా. అయితే కంగ‌నా మ‌రో అడుగు ముందుకు వేసింది. 

త‌న న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తూ స్టార్ హీరోలు ఫోన్లు చేస్తున్నార‌ని కంగ‌నా చెప్పుకొచ్చింది. అది కూడా వింత ఏమీ కాదు కానీ, స‌ద‌రు న‌టులు ఈమెకు దొంగ‌చాటుగా, ర‌హ‌స్యంగా ఫోన్ లు చేస్తున్నార‌ట‌! ర‌హ‌స్యంగా ఫోన్లు చేసి అభినందిస్తున్నార‌ట‌! అయినా ఒక హీరోయిన్ ని అభినందించ‌డం వెనుక అంత ర‌హ‌స్యం ఏముంటుంది? అంత ర‌హ‌స్యంగా ఫోన్ కాల్స్ ఎందుకు చేస్తారు? అనేదే స‌గ‌టు ప్రేక్ష‌కుడికి వ‌చ్చే అనుమానం.

ఈ విష‌యంలో కూడా కంగ‌నానే క‌ళ్లు తెరిపించింది. బ‌హిరంగంగా త‌న న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తే స‌ద‌రు హీరోల‌కు బాలీవుడ్ మాఫియా నుంచి ప్ర‌మాదం ఉంటుంద‌ట‌. అందుకే వారు ర‌హ‌స్యంగా ఫోన్లు చేసి త‌న‌ను అభినందిస్తున్నార‌ట‌! ఇదీ కంగ‌నా ట్వీటు సారాంశం! ఇలా ర‌హ‌స్యంగా ఫోన్లు చేసిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ కూడా ఉన్నార‌ట‌. 

అయినా అక్ష‌య్ కుమార్ పెద్ద హీరో. వంద కోట్ల రూపాయ‌ల పై స్థాయి పారితోష‌కం హీరో. అలాంటి హీరో ఈమెను ప్ర‌శంసిస్తే బాలీవుడ్ మాఫియా నుంచి అత‌డికి ప్ర‌మాదం ఉంటుందా! అక్ష‌య్ కుమారే అటు రాజ‌కీయ బ్యాక‌ప్ ఇటు ఆర్థిక శ‌క్తితో బాలీవుడ్ ను శాసించే రేంజ్ లో ఉన్నాడు. అలాంటిది అత‌డు అంత ర‌హ‌స్యంగా, అంద‌రికీ భ‌య‌ప‌డుతూ ఈమెను అభినందిస్తాడా! ఒక ట్వీట్ పెడితే అత‌డిని ఎవ‌రైనా తిడ‌తారా కొడ‌తారా!

అలియా భ‌ట్, దీపికా వంటి వారికి కోపం వ‌స్తుంద‌ని.. బాలీవుడ్ మాఫియాతో ముప్పు అని..అందుకే త‌న‌కు అక్ష‌య్ తో స‌హా ప‌లువురుస్టార్లు ర‌హ‌స్యంగా ఫోన్లు చేసి అభినందించార‌ని కంగ‌నా చెప్పుకుంటోంది! ఏమిటో ఈమె తీరు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?