Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పెళ్లి విష‌యంలో స్టార్ హీరోయిన్ అంత ర‌హ‌స్య‌మెందుకు?

పెళ్లి విష‌యంలో స్టార్ హీరోయిన్ అంత ర‌హ‌స్య‌మెందుకు?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినాకైఫ్ - ప్ర‌స్తుతం ఊపు మీదున్న న‌టుడు విక్కీ కౌశ‌ల్ ల పెళ్లి కార్య‌క్ర‌మాలు చాలా ర‌హ‌స్యంగా సాగుతున్నాయ‌ని అంటోంది మీడియా. గ‌త కొన్నాళ్లుగా వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారంటూ మీడియాలో చాలా క‌థ‌నాలే వ‌చ్చాయి. వారిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా ర‌క‌ర‌కాల ఆధారాల‌ను వీక్ష‌కుల ముందు ఉంచింది.

ఇక క‌త్రినాకు గ‌తంలో కూడా ఇలాంటి స్టోరీలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇది ఎంత వ‌ర‌కూ వెళ్తుంద‌నేది శేష ప్ర‌శ్న‌గానే మిగిలింది. అయితే ఇప్పుడు మీడియానే మ‌రో అడుగు ముందుకు వేసి.. క‌త్రినా, విక్కీలు ఎంగేజ్డ్ అని, డిసెంబ‌ర్ మొద‌టి వారంలో వారి పెళ్లి కూడా అని క‌థ‌నాల‌ను ఇస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ అంశంపై క‌త్రినా, విక్కీలు ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు!

మ‌రి వారి నుంచి ఎలాంటి ధ్రువీక‌ర‌ణా లేకుండా, ఇంత జ‌రుగుతోందా? అనే ప్ర‌శ్న‌కూ మీడియానే స‌మాధానం ఇస్తోంది. త‌న వ్య‌క్తిగత విష‌యాల‌ను లో ప్రొఫైల్ లో ఉంచ‌డం క‌త్రినాకు ఇష్ట‌మ‌ని, అందుకే ఆమె ఎలాంటి  స‌మాచారం ఇవ్వ‌డం లేద‌నే మీడియా ఇస్తున్న స‌మాచారం. అయితే.. అధికారికంగా విష‌యాన్ని ధ్రువీక‌రించ‌క‌పోతే, అప్పుడు జ‌రిగే ప్ర‌చారాలు.. మొద‌టికే మోసాన్ని తీసుకు వ‌స్తాయి. ఈ మాత్రం క‌త్రినాకు తెలియ‌క‌పోదు.  

కానీ జ‌రుగుతున్న ప్రచారాల గురించి క‌త్రినా వైపు నుంచి ఎలాంటి ఖండ‌న‌మండ‌న‌లు లేవు. డిసెంబ‌ర్ ఏడు- తొమ్మిదో తేదీల మ‌ధ్య‌న రాజ‌స్థాన్ లో వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని మీడియా ఘంటాప‌థంగా చెబుతూ  ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రికీ ఆహ్వానాలు లేవ‌ని, త‌మ స‌హ‌చ‌ర న‌టీన‌టుల‌ను కూడా క‌త్రినా, విక్కీలు ఇప్ప‌టి వ‌ర‌కూ పిలిచింది కానీ, స‌మాచారం ఇచ్చింది కానీ లేద‌ట‌. మొత్తానికి ఈ వ్య‌వ‌హారాన్ని క‌త్రినా చాలా గుంభ‌నంగా ఉంచుతున్న‌ట్టుగా ఉంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?