Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్-ఆ విధంగా సెట్ అయ్యిందా

అఖిల్-ఆ విధంగా సెట్ అయ్యిందా

సైరా సినిమా తరువాత సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తారా? అని ఆసక్తిగా వుండేది. కానీ సైరా ఫలితం తరువాత ముఖ్యంగా కాస్ట్ ఫెయిల్యూర్ భయంకరంగా జరిగింది అన్న టాక్ బయటకు వచ్చాక, ఎవరు అవకాశం ఇస్తారు అన్నది మరింత ఆసక్తిగా మారింది. 

దీనికి తోడు నలభై కోట్ల రేంజ్ కథ పట్టుకుని వుండడంతో చాలా మంది వెనుకంజ వేసారు. చాలా హీరోల పేర్లు వినిపించి అఖిల్ సినిమా ఫైనల్ అయింది.

నిర్మాత అనిల్ సుంకర చాలా ధైర్యంతో అఖిల్ తో నలభై కోట్ల సినిమా అటెంప్ట్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ డీల్ వేరే అని ఇప్పుడు బయటకు వచ్చింది. 

ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల డేట్, టైటిల్ అన్నీ వదిలారు. దాంతో పాటే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా భాగస్వామి అని క్లారిటీ వచ్చింది. సహ నిర్మాతగా, కో బ్యానర్ గా డిటైల్స్ వెల్లడయ్యాయి.

సో అందువల్లే అనిల్ సుంకర ధైర్యంగా ఈ ప్రాజెక్టు టేకప్ చేసారన్నమాట. మొత్తానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా నిర్మాణ భాగస్వామి అయ్యారు కాబట్టి, మార్కెట్ ను మించిన ఖర్చు వుండదని, కాస్ట్ ఫెయిల్యూర్ అనే మాట మరి వినిపించదని ఆశిద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?